Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-08-2024 - సోమవారం మీ రాశి ఫలితాలు.. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయకుండా..?

రామన్
సోమవారం, 5 ఆగస్టు 2024 (05:00 IST)
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ శు॥ పాఢ్యమి సా.4.52 ఆశ్రేష ప.3.22 తె.వ.4.21 ల ప.దు. 12.31 ల 1.22 పు.దు. 3.04 3.55.

 
మేషం:- ఇంటి ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. సంగీత, సాహిత్య కార్యక్రమాల్లో పొల్గొంటారు. విలాసవస్తువుల పట్ల ఆసక్తి పెరుగు తుంది. మీ సోదరి మొండి వైఖరిమీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసివస్తుంది. బ్యాంకు పనుల్లో మెలకువ వహించండి. 
 
వృషభం :- ఖర్చులు పెరిగినా ఆర్థిక సంతృప్తి, ప్రయోనం పొందుతారు. రుణములు కొన్ని తీరుస్తారు. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేసుకుండా సద్వినియోగం చేసుకోండి. బంధువుల మధ్య సయోధ్య నెలకొంటుంది. ఉద్యోగస్తులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యములో సమస్యలు తలెత్తుతాయి. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
మిధునం:– కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియా వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. అర్థాంతంగా ముగించిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు వంటివి ఎదుర్కొంటారు.
 
కర్కాటకం:- ఆలయాలను సందర్శిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ యత్నాలు ఫలించకపోవటంతో నిరుత్సాహం చెందుతారు. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు.
 
సింహం:- తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. ఒక స్తిరాస్థి విక్రయంలో పునరాలోచన మంచిది. మీ వ్యవహారాలు సాధ్యమైనంత వరకు మీరే సమీక్షించుకోవడం మంచిది. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయకుండా సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యములో సమస్యలు తలెత్తుతాయి.
 
కన్య:- ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఉద్యోగరీత్యా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. రాజకీయాలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
తుల:- బంధు మిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. వాహనం నిదానంగా నడపటం శ్రేయస్కరం. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చకండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఐరన్, సిమెంట్, కలప రంగాలలో వారికి చికాకులు తప్పవు.
 
వృశ్చికం:- ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. నిరుద్యోగులు, వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం.
 
ధనస్సు: ఆర్ధిక పరమైన చర్చలకు అనుకూలం. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహరాలు ప్రగతి పథంలో నడుస్తాయి. ఉమ్మడి వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
మకరం:- సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీల పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. స్త్రీలు విలువైన వస్తువులు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంటడం మంచిది.
 
కుంభం:- ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పొల్గొంటారు. భార్యా, భర్తల మధ్య సరైన అవగాహనలేక మనస్పర్ధలు రావచ్చును. ధనం ఏ కొంతైనా నిల్వ చేయటం వల్లసంతృప్తి కానవస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లోమీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. పాత మిత్రుల కలయికతో కొత్త అనుభూతి పొందుతారు.
 
మీనం:- శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు మెళుకువ అవసరం. సొంత నిర్ణయాల వల్ల కలహాలు, చికాకులు వంటివి తలెత్తుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలోను, ప్రయాణాలలోను అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. మీ సమర్థతపై ఎదుటివారికి విశ్వాసం ఏర్పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

Rohini Vrat 2024: రోహిణి వ్రతం ఆచరిస్తే.. పేదరికం పరార్

Kamika Ekadashi: కామిక ఏకాదశి: శ్రీ విష్ణు సహస్రనామం పఠిస్తే.. లక్ష్మీదేవిని పూజిస్తే?

Kamika Ekadashi 2025: కామిక ఏకాదశిని మిస్ చేసుకోకండి.. తులసీ ముందు నేతి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments