Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-07-2022 మంగళవారం రాశిఫలాలు ... కార్తీకేయుడిని పూజించినా...

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (04:00 IST)
మేషం :- కాంట్రాక్టర్లు పని వారి వల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. ప్రయాణాలు, ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత వహించండి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ దీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. రావలసిన బకాయిలు సకాలంలో అందుతుంది. 
 
వృషభం :- లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు తోటి వారి నుంచి శుభవార్తలు వింటారు. చిన్నారుల విషయంలో పెద్దలగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఓర్పు, సర్దుబాటు ధోరణితో మెలగటం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ఖర్చులెదురైనా ఇబ్బందులు ఏమాత్రం ఉండవు.
 
మిథునం :- కళాకారులకు, సినిమా రంగాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. ఆకస్మిక ఖర్చులు ఎదురవుతాయి. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కుంటారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి.
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు అనుకున్న విధంగా లాభిస్తాయి. శారీరక ఆరోగ్యంనందు కొద్దిపాటి మార్పులువచ్చే సూచనలున్నాయి. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ పట్టుదల కార్యరూపం దాల్చుతుంది. ఇరుగు పొరుగు వారి మధ్య కలహాలు అధికమవుతాయి. ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. దుబారా నివారించలేరు.
 
సింహం :- ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఉద్యోగంలో మానసిక అశాంతి, చికాకులు సంభవిస్తాయి. ప్రేమికుల అనుమానాలు మరింతగా బలపడతాయి. వాహనయోగం పొందుతారు. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. విద్యాసంస్థలలో వసతి లభిస్తుంది. ప్రియతములను కలుసుకుంటారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు.
 
కన్య :- సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. శతృవులపై విజయం సాధిస్తారు. గృహోపకరణాలు, వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. వృత్తి వ్యాపారస్తులకు అధికశ్రమ ఉండును. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిర్మాణ పనులలో నాణ్యత లోపం వల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లు కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
తుల :- వృత్తి పనివారు ఇబ్బందులకు గురవుతారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ప్రైవేటు, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన ధనం అందటంతో మానసికంగా కుదుటపడతారు.
 
వృశ్చికం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. గతంలో వాయిదా పడిన పనులు మరల ప్రయత్నించుట వలన ముందుకు సాగును. వ్యాపార వ్యవహారాల్లో జాయింట్ సమస్యలు రావచ్చును. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. 
 
ధనస్సు :- ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. గౌరవ ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని బంధాలు మీకు అనుకూలంగామారి మిమ్మల్ని ఆనందంలో ముంచుతాయి. మిత్ర సహాయములతో మీ పనుల్లో పురోభివృద్ధి పొందుతారు. వ్యవసాయ దారులు పంటల్లో లాభాలు గడిస్తారు.
 
మకరం :- హోటలు తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలుస్ఫురిస్తాయి. కాంట్రాక్టుదారులకు ఆందోళనలు కొన్ని సందర్భములందు ధననష్టము సంభవించును. మీ యత్నాలను కొంతమంది నీరుగార్చేందుకు యత్నిస్తారు.
 
కుంభం :- బంధు మిత్రులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెలకువ అవసరం. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
మీనం :- సాంఘిక, బంధు మిత్రుల యందు అన్యోన్యత తగ్గును. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో చికాకులు ఎదుర్కుంటారు. కీలకమైన వ్యవహారాల్లో మెలకువ వహించండి. సినీరంగ పరిశ్రమల్లో వారికి చికాకులు, ఒత్తిడి అధికమవుతుంది. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికా వెళ్లే విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్

Mulugu: తెలంగాణలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. ములుగులో హై అలెర్ట్ (video)

కాఫీ బెర్రీ బోరర్ నుంచి అరకు కాఫీకి సరికొత్త ముప్పు

తెలంగాణలో భారీ వర్షాలు.. నీట మునిగిన ఆరు జిల్లాలు, ఆరుగురు మృతి

Jagan: చంద్రబాబుపై జగన్ విమర్శలు.. 14 నెలలు గడిచినా హామీలు నెరవేర్చలేదు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesh Chaturthi 2025: వినాయక చతుర్థి రోజున మరిచిపోయి కూడా ఈ విషయాలు చేయకండి.

Ganesh Chaturthi 2025: గణేశ చతుర్థి రోజున విరిగిన విగ్రహాన్ని ఇంటికి తేవడం..?

25-08-2025 సోమవారం ఫలితాలు - ఒప్పందాల్లో జాగ్రత్త.. ఏకపక్ష నిర్ణయాలు తగవు...

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments