Webdunia - Bharat's app for daily news and videos

Install App

04-08-2024 ఆదివారం దినఫలాలు - అవివాహితులు శుభవార్తలు వింటారు...

రామన్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ బ॥ అమావాస్య ప.3.59 పుష్యమి ప.1.50 తె.వ.3.27 ల5.09. సా.దు. 4.46 ల 5.37.
 
మేషం :- మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. సాహసకృత్యాలకు, వాదోపవాదాలకు ఇది సమయం కాదని గమనించండి. నిరుద్యోగలకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత ముఖ్యం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వివాహం కానివారు శుభవార్తలు వింటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
వృషభం :- ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్థిరబుద్ధి లేకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. పెద్దల ఆరోగ్యం మందగించే సూచనలున్నాయి.
 
మిథునం :- ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా క్రమేపీ సర్దుబాటు కాగలదు. వాహనం నడుపుతున్నపుడు మెళుకువ, ఏకాగ్రత వహించండి. స్త్రీలకు బంధువర్గాలతో సఖ్యత నెలకొంటుంది. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. విదేశీ పర్యటనల కోసం చేసే యత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి.
 
కర్కాటకం :- హోటల్, తినుబండారాలు, బేకరీ వ్యాపారులకు లాభదాయకం. బంధువుల గురించి అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. గృహనిర్మాణాలు, మరమ్మతులలో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. చిన్నచూపు చూసిన వారే మీ ఔన్నతాన్ని గుర్తిస్తారు. రావలసిన మొండిబాకీలు వాయిదాపడతాయి.
 
సింహం :- మీ శ్రమ, యత్నాలు వృధా కావు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదని గమనించండి. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.
 
కన్య :- నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి సద్వినియోగం చేసుకొండి. ఒక స్థాయి వ్యక్తుల కలయిక ఆశ్చర్యం కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దలు పరోపకారానికి పోవటం వల్ల మాటపడవలసి వస్తుంది. ఇతరుల వ్యవహారాలలో మౌనం పాటించడం మంచిది.
 
తుల :- విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. గుట్టుగా వ్యాపార యత్నాలు సాగించండి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కీలకమైన విషయాల్లో పట్టు సాధిస్తారు.
 
వృశ్చికం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో పనివారలతో చికాకులుతప్పవు.
 
ధనస్సు :- ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వాహనం నడపటంవల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. భాగస్వామిక వ్యపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలుచేస్తారు.
 
మకరం :- ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో శ్రద్ధ, ఆసక్తి చూపుతారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెగుతుంది. పుణ్య కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందజేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కుంభం :- రాజకీయనాయకులకు ప్రయాణాలలోనూ, అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. స్త్రీల ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు.
 
మీనం :- శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులుపడుట వలన మాట పడవలసి వస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. విద్యార్థుల అత్యుత్సాహం విపరీతాలకు దారితీసే ఆస్కారం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీచ్ రిసార్ట్‌ విహారయాత్ర... స్విమ్మింగ్ పూల్‌లో మునిగి మహిళలు మృతి (video)

పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని.. 18మంది విద్యార్థినులకు హెయిర్ కట్ (video)

దుఃఖ సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : నారా రోహిత్

మంగళగిరిలో లేడీ అగోరి హల్చల్‌- పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు రోడ్డుపైనే..? (Video)

టీ అడిగితే లేదంటావా.. బేకరీలో మందుబాబుల ఓవరాక్షన్.. పిచ్చకొట్టుడు.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

వాస్తు దోషాలు, గ్రహ దోషాలకు చెక్ పెట్టాలంటే..?

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments