Webdunia - Bharat's app for daily news and videos

Install App

03-04-2024 బుధవారం దినఫలాలు - ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఏకాగ్రత ముఖ్యం...

రామన్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (04:04 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ బ|| నవమి ప.1.54 ఉత్తరాషాఢ సా.5.41 రా.వ.9.29 ల 11.00.
ప.దు. 11.30 ల 12.21.
 
మేషం :- ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఏకాగ్రత చాలా అవసరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. మీ విజ్ఞత, నిజాయితీలకు ప్రశంసలు లభిస్తాయి. మీ మనసు మార్పును కోరుకుంటుంది. వ్యాపారాల్లో కష్టనష్టాలను కొంతమేరకు అధికమిస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృషభం :- నోటీసులు, రశీదులు అందుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు అనుగకూలం. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలనే మీ నిర్ణయం బలపడుతుంది.
 
మిథునం :- స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయదారులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మార్కెటింగ్ రంగలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. ఎల్.ఐ.సి, పోస్టల్, ఇళ్ళ స్థలాల బ్రోకర్లకు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి.
 
కర్కాటకం :- ఓర్పు, నేర్పుతో వ్యవహరించటం ఎంతైనా అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. చిన్నారులకు అవసరమైన వస్తువులను కోనుగోలు చేస్తారు. ఫైనాన్సు, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. శ్రీవారు, శ్రీమతి విషయంలో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది.
 
సింహం :- ఉద్యోగ వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు అమలు చేస్తారు. నూతన పెట్టుబడులు పెట్టునపుడు జాగ్రత్త అవసరం. మీ సంతానం వివాహ, విద్యా విషయాలు ఆందోళన కలిగిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
కన్య :- పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికిమాటికి అసహనం ఎదుర్కుంటారు. విద్యార్థులు అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం క్షేమదాయం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. అనుకోకుండా వ్యాపార విషయమై ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
 
తుల :- ఉద్యోగస్తులకు అధికారిక పర్యటనలు, బాధ్యతల మార్పిడి వంటి ఫలితాలున్నాయి. మందులు, రసాయినిక, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలసిరాగలదు. గత కొంత కాలంగా కుటుంబములోని వివాదాలు తొలగిపోతాయి. దూరపు బంధువులను కలుసుకొని ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు.
 
వృశ్చికం :- ఆర్ధిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు అన్నివిధాలా కలిసివస్తుంది. దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
ధనస్సు :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి రాబట్టుకోవటం సాధ్యం కాదని గమనించండి. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. లాయర్లకు నిరుత్సాహం కానవస్తుంది.
 
మకరం :- వైద్యులు శస్త్రచికిత్స చేయునప్పుడు మెళకువ అవసరం. వాహనం ఇతరులకు ఇచ్చిఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైనకాలం. సాంఘిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగంలో వారికి కలసి వచ్చేకాలం. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు.
 
కుంభం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి అభద్రతాభావం, ఆందోళనలకు గురవుతారు. ప్రత్యర్ధులు స్నేహ హస్తం అందిస్తారు. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బంధు మిత్రుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. భాగస్వామిక చర్చలు ఆర్ధాంతంగా ముగుస్తాయి.
 
మీనం :- హోటల్, క్యాటరింగ్ రంగాలవారికి లాభదాయకం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగును. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వ్యవసాయ రంగంలో వారికి వాతావరణంలో మార్పు సంతృప్తినిస్తుంది. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: శ్రీవాణి దర్శనం టిక్కెట్లు.. దర్శనం సమయం సాయంత్రం 5 గంటలకు మార్పు

Soul Photo: పితృదేవతల పటాలు ఇంట్లో వుంచవచ్చా? వుంచితే ఏంటి ఫలితం?

31-07-2025 గురువారం ఫలితాలు - పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం....

Thursday Fast: గురువారం బృహస్పతిని పూజిస్తే ఏంటి ఫలితం?

Godess Saraswati: సరస్వతీ దేవిని చదువులకు మాత్రమే తల్లి అంటూ పక్కనబెట్టేస్తున్నారా? తప్పు చేశాం అనే మాటే రాదు

తర్వాతి కథనం
Show comments