Webdunia - Bharat's app for daily news and videos

Install App

25-09-2020 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవికి పూజలు చేస్తే సర్వదా శుభం

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (05:00 IST)
మేషం : సంకల్పసిద్ధితో ముందుకుసాగి పాత సమస్యలను పరిష్కరించండి. విదేశీ వాణిజ్యం, ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలించగలవు. ప్రత్యర్థుల దృష్టి మీపై ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
వృషభం : వ్యాపారాభివృద్ధికే చేయు కృషిలో సఫలీకృతులవుతారు. ముఖ్యుల నుంచి వార్తలు అందుకుంటారు. రాబోయే కాలంలో ఖర్చులు, అవసరాలు మరింతగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిదని గమనించండి. 
 
మిథునం : ముఖ్యమైన విషయాలకు గోప్యంగా ఉంచండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. నూతన పెట్టుబడులు ఆశించినంత సత్ఫలితాలను ఇవ్వవు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు ఆశాజనకం. 
 
కర్కాటకం : ఆనందకరమైన హృదయంతో ఎలాంటి పనిలోనైనా విజయాన్ని సాధించవచ్చన్న వాస్తవాన్ని గుర్తిస్తారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. సిమెంట్, ఐరన్, వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు బదిలీ అయ్యే ఆస్కారం ఉంది. 
 
సింహం : చిన్నచిన్న విషయాలలో ఉద్రేకంమాని తెలివితేటలతో ముందుకుసాగి జయం పొందండి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆపరేషన్లు చేయునపుడు వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. మెరుగైన నిర్ణయాలు తీసుకుని కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు పొందుతారు.
 
కన్య : సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం మంచిది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. అదనపు రాబడిక కోసం యత్నాలు సాగిస్తారు. చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
తుల : స్థిరచరాస్తుల చర్చల విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రేమికులకు మధ్య నూతన ఆలోచనలు స్ఫురించగలవు. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత అధికం. 
 
వృశ్చికం : ఉపాధ్యాయులకు, ప్రైవేటు, పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, అంకింతభావం చాలా ముఖ్యం. హోటల్, తినుంబడ రంగాలలో వారికి కలిసిరాగలదు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ రంగాల్లో వారు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఇతరులపై ఆధారపడే పనులు కావన్న విషయాన్ని గుర్తించండి. ప్రైవేటు సంస్థలలో వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మకరం : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. శ్రమించిన కొలదీ ఫలితం. కార్యసాధనలో అనుకూలతలుంటాయి. మీ ఆలోచనలు పథకాలు గోప్యంగా ఉంచండి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యవసాయ తోటల, రంగాల్లో వారికి ఆశాజనకం. 
 
కుంభం : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీదికాని వస్తువును ఆశించడం వల్ల భంగపాటుకు గురవుతారు. వృత్తి వ్యాపారాల్లో అవరోధాలు తొలగిపోతాయి. వాగ్వివాదాలకు దిగి సమస్యలు తెచ్చుకోకండి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. టాక్స్ వంటి సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. 
 
మీనం : ఆపదసమయంలో బంధు మిత్రులు అండగా నిలుస్తారు. రాజకీయాల్లో వారికి మతిమరుపు పెరగడం వల్ల ఆందోళనకు గురవుతారు. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. దూర ప్రయాణాలలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆప్ మరో కీలక హామీ : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

భారతీయులకు అమెరికా శుభవార్త.. ఆ వీసాలో మార్పులు

పాదగయ క్షేత్రం ప్రసాదంలో పురుగులు.. పవన్ కల్యాణ్ ఇలాకాలో ఇలానా? (video)

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానులపై నాలుగు కేసులు - ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

తర్వాతి కథనం
Show comments