Webdunia - Bharat's app for daily news and videos

Install App

21-04-2021 బుధవారం దినఫలాలు - శ్రీరామునికి పానకం, బెల్లం నైవేద్యంగా పెట్టినా...

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (04:00 IST)
మేషం : వృత్తులవారికి లాభసాటి అవకాశాలు లభిస్తాయి. మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మ కోరికలు ఇబ్బంది కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తులవుతారు. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. 
 
వృషభం : అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఉమ్మడి వ్యాపారాలు, సామాన్యంగా సాగుతాయి. స్త్రీలకు బంధు వర్గాల నుంచి వ్యతిరేకత, ఆరోగ్యంలో చికాకులు అధికమవుతాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. 
 
మిథునం : శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఓర్పు, సహనంతో మీ లక్ష్యాలను సాధిస్తారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. కొన్ని వ్యవహారాలు మీరే సమీక్షించుకోవడం క్షేమదాయకం. ప్రైవేటు ఉపాధ్యాయులకు ఒత్తిడులు తప్పవు. తలపెట్టిన పనులు అర్థాంతరంగా ముగించవలసి వస్తుంది. 
 
కర్కాటకం : మీ విలాసాలకు, సంతోషాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ పనితీరు మాటకారితనం ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. పత్రికా సంస్థలోని వారికి ఏకాగ్రత అవసరం. రాజకీయ నాయకులు అధికంగా ఆలోచించడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. 
 
సింహం : పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో దాయాదుల నుంచి అభ్యంతరాలెదుర్కొంటారు. ఉద్యోగస్తులకు త్వరలో పదోన్నతి, బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు. 
 
కన్య : ప్రతి విషయంలోనూ మీ ఆధిక్యతను నిలుపుకుంటారు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. రాజకీయ నాయకులు ఊపిరి పీల్చుకుంటారు. దైవ, దర్శనాలు జరుపుకుంటారు. మీ ఉత్సహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
తుల : స్త్రీలకు షాపింగ్‌ వ్యవహారాలలో మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కొంతమంది మీ నుంచి ధన సహాయం కోరవచ్చు. ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
వృశ్చికం : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. జ్ఞాపకాలు కలబోసుకుంటారు. కుటుంబీకుల గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. బహిరంగ సభలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : ఏదైనా విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలు, ఉన్నత పదవులు లభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంకాగలవు. 
 
మకరం : తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు వ్యవసాయ, ఎగుమతి దిగుమతులు లభిస్తాయి. కిరాణా ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, విత్తన వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. 
 
కుంభం : పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. ఏసీ, కూలర్, ఇన్వెర్టర్ వ్యాపారులకు లాభదాయకం. కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ప్రేమికులకు పెద్దల వల్ల సమస్యలు తలెత్తుతాయి. పత్రికా, ప్రైవేటు సంస్థల ఉద్యోగుల్లో అభద్రతాభావం చోటుచేసుకుంటుంది. 
 
మీనం : రావలసిన ధనం అందటంతో నిర్మాణ కార్యక్రమాలు చురుకుగా సాగుతాయి. బాగా నమ్మే వ్యక్తులే మిమ్మలను మోసం చేసే ఆస్కారం ఉంది. అనవసరపు ఖర్చులు మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. వ్యవసాయదారులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులు, యూనియన్ వ్యవహారాల్లో తలమునకలవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

లేటెస్ట్

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments