Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-08-2021 శుక్రవారం దినఫలాలు - వరలక్ష్మీదేవిని ఆరాధించినా...

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (04:00 IST)
మేషం : రాజకీయాలలో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. స్కీంలు, వాయిదాల పద్దతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. స్త్రీలపై పొరుగువారి ప్రభావం అధికంగా ఉంటుంది. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. 
 
వృషభం : చిన్నతరహా పరిశ్రమల్లో వారికి విద్యుత్ లోపం వల్ల దుబారా నివారించలేకపోవడం వల్ల అశాంతి అధికం అవుతుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు జాగ్రత్త అవసరం. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చకండి. మీ ఉన్నత స్థితిని చూసి ఓర్వలేనివాడు అధికమవుతున్నారు అని గమనించండి. 
 
మిథునం : తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, చికాకులు ఎదుర్కొంటారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. సంగీత, సాహిత్య, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు కొంతమంది మీ పరపతిని దుర్వినియోగం చేస్తారు 
 
కర్కాటకం : ఒక్కోసారి అతి మొండివైఖరి అవలంభించడం వల్ల అపవాదులు ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. సహకార సంఘాల్లో వారికి ప్రైవేటు సంస్థల్లో వారికి ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. వైద్యులకు ఏకాగ్రత అవసరం.
 
సింహం : పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. తలపెట్టిన పనులు అర్థాంతరంగా ముగిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఫ్యాన్సీ వ్యాపారస్తులకు పురోభిృద్ధి కానవస్తుంది. మీ శక్తి సామర్థ్యాలపై విశ్వాసం సన్నగిల్లుతుంది. రుణాలు, చేబదుళ్లు స్వీకరించవలసి వస్తుంది. 
 
కన్య : ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. కొంతమంది మిమ్మల్న నిరుత్సాహ పరచడానికి ప్రయత్నిస్తారు. ఉమ్మడి ఆస్తి విక్రయాల్లో సోదరుల నుంచి అభ్యంతరాలెదుర్కొంటారు. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
తుల : ఇంజనీరింగ్, మెడికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి పురోవృద్ధి కానవస్తుంది. విద్యార్థులు విదేశాల్లో పై చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వృత్తులు, కార్మికులు, నిరుద్యోగులకకు సదావకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పనివారికి పనిభారం అధికమవుతుంది. మీ సంతానం పై చదువుల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. మీ సమస్యలను ఆత్మీయులకు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పాత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఇంజనీరింగ్ రంగాల్లో వారికి, బిల్డర్లకు ఒత్తిడి, చికాకులు అధికం అవుతుంది. 
 
ధనస్సు : ఆర్థిక విషయాల్లో కొంత మేరకు పురోగతి సాధిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయలు చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నూతన వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. బంధువులతో చిన్న చిన్న కలహాలు జరిగే ఆస్కారం ఉంది. 
 
మకరం : ఆర్థిక లావాదేవీలు బాగా కలిసివస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. అపార్థాలు మాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. రాజకీయ రంగంలో వారికి ఆరోగ్యం లోపం. అధిక శ్రమ ఉంటాయి. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. 
 
కుంభం : దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. 
 
మీనం : లౌక్యంగా వ్యవహించి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. నూతన పరిచయాలేర్పడతాయి అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఎదుటివారు చెప్పేది జాగ్రత్త విని మీ ఆలోచనలను తగిన విధంగా మలుచుకోండి. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

UP Horror: 52 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బావమరిది, అత్త హత్య చేశారు..

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

అన్నీ చూడండి

లేటెస్ట్

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

తర్వాతి కథనం
Show comments