Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-01-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు..

Webdunia
ఆదివారం, 5 జనవరి 2020 (06:00 IST)
ఆదివారం పూట ఆదిత్య హృదయం చదివినా లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. దూర ప్రయాణాల్లో మీ సంతానం పట్ల శ్రద్ధ వహించండి. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. నిరుద్యోగులకు ప్రకటనల వల్ల అవగాహన ముఖ్యం.
 
వృషభం: బంధువుల రాక కొంత అసౌకర్యం కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికం అవుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో సఫలీకృతులవుతారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి.
 
మిథునం: రాజకీయనాయకులు తరచూ సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు, స్త్రీల మనోవాంఛలు నెరవేరటంతో కొత్త అనుభూతికి లోనవుతారు. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంత నుంచి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.
 
కర్కాటకం: గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. మందుచూపుతో వ్యవహరించడం చాలా మంచిది. ప్రయాణాల్లో  కొత్త పరిచయాలేర్పడతాయి. ముఖ్యమైన పనులు మీరే చూసుకోవడం మంచిది. పండ్లు, పువ్వులు, కొబ్బరి, పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు ఖర్చులు అధికమవుతాయి.
 
సింహం: కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊపిరి పీల్చుకుంటారు. స్త్రీలకు షాపింగ్ విషయాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి.
 
కన్య: హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. గృహ నిర్మాణాలకు కావలసిన అనుమతులు, వనరుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. మిత్రులతో కలిసి సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. బంధువులు మీ యత్నాలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారు.
 
తుల: స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. మీ శ్రీమతి ఇచ్చిన సలహాను తేలికగా కొట్టివేయడం మంచిది కాదు.
 
వృశ్చికం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు బాగుగా కలిసివస్తుంది. ఇతరుల వాహనం నడపటం వల్ల అనుకోని సమస్యలు తలెత్తగలవు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రయాణాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మీ ప్రయత్నాలు, పథకాలు గుట్టుగా సాగించండి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
ధనస్సు: ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తటానికి ఆస్కారం వుంది. నిరుద్యోగులు ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. 
 
మకరం: మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకుంటారు. రాజకీయాల్లో వారికి అలజడి అధికమవుతుందని గమనించండి. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు.  ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడం వల్ల మాటపడాల్సి వస్తుంది.
 
కుంభం: స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఎంత కష్టమైనా పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విదేశాలకు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరి, సోదరుల మధ్య సంబంద బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. 
 
మీనం: పత్రికా రంగంలోని వారికి చిన్న చిన్న తప్పిదాలు జరిగే సూచనలున్నాయి. రాజకీయ నాయకులకు కొన్ని సమస్యలు, అవమానాలు తలెత్తుతాయి. బంధువుల రాక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మీ అభిప్రాయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట

భార్యపై అనుమానం... పిల్లలకు చిప్స్ - కూల్‌డ్రింక్స్ కొనిచ్చి రైలు కింద తోసేచిన తండ్రి... ఆపై తాను కూడా...

Duvvada Srinivas: కూతురు హాఫ్ శారీ ఫంక్ష‌న్‌లో డ్యాన్స్ ఇరగదీసిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి

బలవంతపు పెళ్లి చేస్తున్నారు... ఏం చేస్తానో చూడండి.. తల్లికి సోనమ్ వార్నింగ్

Honeymoon murder case: షిల్లాంగ్‌కు సోనమ్.. నిందితుడిని చెంపదెబ్బ కొట్టిన ప్రయాణీకుడు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

తర్వాతి కథనం
Show comments