Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పాపికొండల" విహారానికి సరికొత్త నియమావళి

Webdunia
సుందర గోదావరికి మరిన్ని అందాలు అద్దేవి పాపికొండలు. ఇక్కడ గోదావరి వేదంలా ఘోషిస్తూ ఆ గిరుల కురుల మధ్య నుంచి పాపిటలా సాగిపోతూ... సన్నగా, సన్నాయి స్వరంలా హొయలు పోతుంటుంది. భద్రాద్రి రాముణ్ని చేరేందుకు ఆ పవిత్ర గౌతమిలో లాంచీల్లో ప్రయాణం చేస్తుంటారు భక్తులు. దారి పొడవునా పసిడి కాంతుల ఇసుక తిన్నెలు, గిరిజనులు, నాటుపడవల సందడితో పాపికొండలు జీవం ఉట్టిపడుతూ ఉంటాయి.

జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఈ పాపికొండలను సందర్శించే విహారయాత్రల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాలను, నియంత్రణ లేని ఆజమాయిషీలను అరికట్టేందుకు అక్కడి జిల్లా అధికార యంత్రాంగం నడుం బిగించింది. ఇందుకుగానూ ఓ నూతన నిబంధనా నియమావళిని రూపొందించింది.

ఇందులో భాగంగా... లాంచీల రాకపోకలపై పూర్తి స్థాయిలో నియంత్రణకు నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల ప్రత్యేక పర్యవేక్షణ, లాంచీల్లో సీట్ల సామర్థ్యం, రక్షణ చర్యలు పూర్తి స్థాయిలో ఉండేలా యాజమానులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడం, నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్న ఫెర్రీ పాయింట్ల వద్దే లాంచీలను నిలపడం, లాంచీల వేగంపై నియంత్రణ లాంటి అంశాలను కొత్త నియమాళిలో పొందుపరిచారు.

ఇందుకుగానూ... ఐటీడీఏ పీఓ ఛైర్మన్‌గా పలువురు సభ్యులతో కూడిన కమిటీని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పీఓతో పాటుగా భద్రాచలం సబ్ కలెక్టర్, ఎఎస్పీ, నీటిపారుదల శాఖ ఈఈలను కూడా సభ్యులుగా నియమించారు. ఈ నేపథ్యంలో రాబోయే అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే పాపికొండలు-పేరంటాలపల్లి విహార యాత్రకు లాంచీ యజమానులు విధిగా కొత్త నియమావళిని పాటించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే... పాపికొండల ప్రాంతానికి చేరాలంటే, భద్రాచలం నుంచి 160 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. గోదావరి స్రవంతిలో ఈ పాపికొండలకు ప్రాంతానికి ఓ విశిష్టత ఉంది. అదేంటంటే... మామూలుగా రెండు, మూడు కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ నది పాపికొండల దగ్గరకు రాగానే చిక్కిపోతుంది. ఎక్కడా లేని విధంగా ఒదిగిపోతుంది.

ఎంతగానంటే... నది వెడల్పు కేవలం 200 నుంచి 300 మీటర్లే ఉంటుంది. లోతు సుమారు 80 మీటర్ల నుంచి వంద మీటర్లు మాత్రమే ఉంటుంది. అందుకేనేమో... "గోదారికి పాపిడంత దారి ఇచ్చాయి కాబట్టే వీటిని పాపికొండలంటారండ ీ" అని పాపికొండల నడుమ గోదావరిలో ప్రయాణం చేసే పర్యాటకులకు అక్కడి గిరిజనులు గొప్పగా చెబుతుంటార ు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Show comments