Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చంచు కోక కట్టిన పల్లెపడుచు "కంబాల కొండ"

Webdunia
విశాఖపట్నం అనగానే ఎవరికైనా వెంటనే.. అరకులోయ, బొర్రా గుహలు, కైలాసగిరి, రామకృష్ణా బీచ్, రుషికొండ బీచ్, భీమిలి.. ఇవే గుర్తుకొస్తాయి. ఇవన్నీ విశాఖ మెడలో దాగిని మణిహారాలని చెప్పవచ్చు. వీటి సరసనే నిలిచి... పచ్చదనాన్ని తనలో ఇముడ్చుకుని రారమ్మని స్వాగతం చెబుతున్న మరో మణిహారమే "కంబాల కొండ"

చుట్టూ ప్రశాంతమైన కొండలు, జలాశయం, స్వేచ్ఛకు చిరునామా అయిన నెమళ్లు, జింకల్లాంటి ఎన్నో అందాల నిలయం ఈ కంబాల కొండ ఎకో టూరిజం పార్కు. గిరిజనులు నిర్వహించే ఈ పార్కు విశాఖ రైల్వే‌స్టేషన్‌కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు 3 కిలో మీటర్లు మాత్రమే. కొండకు చేరుకోవాలంటే.. రైల్వేస్టేషన్, బస్టాండుల నుంచి ఆటోలూ, బస్సులూ ఉన్నాయి.

సుమారు 7,800 హెక్టార్ల విస్తీర్ణంలో నెలకొని ఉంటుంది ఈ కంబాల కొండ అటవీ ప్రాంతం. ఇందులో 80 ఎకరాలను పార్కు కోసం కేటాయించారు. ఇక్కడ నెమళ్లు, కుందేళ్లు, చిరుతపులులు, పాలపిట్టలు, రామ చిలుకలు.. ఇలా ఎన్నో రకాలైన పక్షులు, జంతువులను చూడవచ్చు. అంతేగాకుండా, సందర్శకులను ఆకట్టుకునేందుకు పార్కు లోపల రివర్ క్రాసింగ్, ట్రెక్కింగ్, బోటింట్ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా సందర్శకులకు ఆహ్వానం పలికే కంబాల కొండ.. చీకటిపడ్డాక మాత్రం ఎవ్వరినీ అనుమతించదు. ఇలా వెళ్లి అలా చూసి రావడం లాగా కాకుండా, ఓ రెండు రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుని వెళ్ళినట్లయితే... కంబాల కొండ అందాలను తనివి తీరా చూడవచ్చు. దీనికోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే, అక్కడ కాటేజీల సౌకర్యం కూడా ఉంది.

కంబాల కొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే... ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ ఇక్కడి నెమళ్ల కోలాహలం ఎక్కువగా ఉంటుంది. పురివిప్పి ఆడే మయూరాల వయ్యారాలను చూసేందుకు క్యూలు కట్టేవారు సందర్శకులూ ఎక్కువే. ఇక చలాకీ కుందేళ్ల వెంట పరుగులు తీసేవాళ్లు కొంతమందైతే... లేళ్లతో పోటీపడేవాళ్లు మరికొందరు. ఇలా ఎవరికి తోచినవిధంగా వాళ్లు పసిపిల్లలైపోతుంటారు.

పచ్చటి ప్రకృతి, జంతువులు, ప్రశాంత వాతావరణంతో పాటు... అక్కడికి దగ్గర్లోని కంబాల జలాశయం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. వర్షాకాలంలో కళకళలాడుతూ ఉండే ఈ జలాశయంలో హాయిగా బోటింగ్ కూడా చేయవచ్చు. అన్నట్టు... ఇక్కడ సరదాగా చేపలు పట్టాలనుకునేవారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి.

కొండమీది నుంచి కంబాల జలాశయానికి చేరుకోవాలంటే... కంబాల కొండకు ఎదురుగా ఉండే మరో కొండకు మధ్యన "రోప్ వే"ను ఏర్పాటు చేశారు. 300 మీటర్ల పొడవుండే ఈ తాడును పట్టుకుని జలాశయంపై నుంచి కొండమీదికి, కొండమీదినుంచి జలాశయం చేరేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. ఇది ఎంతో సాహసంతో కూడుకున్నదే అయినప్పటికీ... అది చాలా గొప్ప అనుభూతిని అందిస్తుందనడంలో సందేహం లేదు.

ప్రకృతి ఒడిలో అందాలను ఆస్వాదిసూ... సైట్ సీయింగ్, బోటింగ్, ట్రెక్కింగ్, జంతువులు, పక్షులతో ఆటలు, పాటలు, సాహసాలు... ఇవన్నీ చేయాలనుందా... అయితే మరెందుకాలస్యం... విశాఖలోని "కంబాల కొండ ఎకో టూరిజం పార్కు"కు పరుగులెత్తండి మరి...! అసలే దగ్గర్లోనే పిల్లలకు వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి కూడా...!
అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

Show comments