Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటక రంగానికి పెరుగుతున్న ఆదరణ

Webdunia
FileFILE
దేశంలో పర్యాటక రంగానికి నానాటికీ ఆదరణ పెరుగుతున్నట్టు కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖామంత్రి అంబికాసోనీ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఫసిపిక్, ఆసియా టూరిజం మార్ట్ బుధవారం ప్రారంభమైంది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పర్యాటక సంస్థలు పాలు పంచుకుంటున్నాయి. ఇందులో పాల్గొన్న మంత్రి అంబికా సోనీ మాట్లాడుతూ.. పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఇందులోభాగంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా 22 మెగా టూరిజం ప్రాజెక్టులను గుర్తించినట్టు తెలిపారు. వీటిలో 14 ప్రాజెక్టుల అభివృద్ధికి కోసం 317 కోట్ల రూపాయలను కేటాయించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులలో తిరుపతి, కడపలు కూడా ఉన్నాయన్నారు. అంతేకాకుండా పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

అలాగే దేశ వ్యాప్తంగా 123 గ్రామీణ పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేశామన్నారు. గత ఏడాదితో పోల్చితే విదేశీ పర్యాటకుల తాకిడి రెట్టింపు అయిందని, వీరి మూలంగా వచ్చే విదేశీ మారకద్రవ్యం కూడా రెండున్నర రెట్లు పెరిగినట్టు మంత్రి అంబికా సోనీ తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments