Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర మంత్రివర్గ తొలి జాబితా వివరాలు

Webdunia
రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నేపథ్యంలో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే పనిలో ముఖ్యమంత్రి వైఎస్ తలమునకలయ్యారు. ఇందులో భాగంగా తొలివిడతగా 35మందికి ఆయన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఎంపికచేసిన ఈ 35మందికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదముద్ర వేసిన తరుణంలో సోమవారం సాయంత్రం గవర్నర్ ఎన్‌డీ తివారీ కొత్త మంత్రివర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

రాష్ట్ర మంత్రివర్గం తొలిజాబితాలో చోటు దక్కించుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయ రామారావు, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, విశాఖనుంచి పసుపులేటి బాలరాజు, తూర్పు గోదావరినుంచి పిల్లి. సుభాష్ చంద్రబోస్, పి. విశ్వరూప్‌లు మంత్రివర్గంలో చోటు సాధించారు. వీరితోపాటు పశ్చిమ గోదావరి జిల్లానుంచి పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, కృష్ణా జిల్లానుంచి పార్థసారధి, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, గాదె. వెంకటరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, మోపిదేవి వెంకటరమణలు కూడా స్థానం సాధించారు.

అలాగే ప్రకాశం జిల్లా నుంచి రోశయ్య, బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఆనం రామనారాయణరెడ్డి, ఖమ్మంనుంచి రామిరెడ్డి వెంకటరెడ్డి, మెదక్‌నుంచి గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, సునీతా లక్ష్మారెడ్డిలను అదృష్టం వరించింది. వీరి తర్వాత రంగారెడ్డి జిల్లానుంచి సబితా ఇంద్రారెడ్డి, నిజామాబాద్‌నుంచి సుదర్శన్ రెడ్డి, చిత్తూరు నుంచి గల్లా అరుణ, పి. రామచంద్రారెడ్డి, కర్నూలునుంచి శిల్పా మోహన్‌రెడ్డి, కడపనుంచి అహ్మదుల్లా, అనంతనుంచి రఘువీరారెడ్డి, మహబూబ్‌నగర్‌నుంచి డీకే అరుణ, జూపల్లి కృష్ణారావులు మంత్రివర్గంలో చేరారు.

చివరగా హైదరాబాద్‌నుంచి దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, వరంగల్ నుంచి పొన్నాల, కొండా సురేఖ, కరీంనగర్‌నుంచి శ్రీధర్‌బాబు, నల్గొండనుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా మంత్రివర్గంలో స్థానం సాధించారు. మంత్రివర్గంతోపాటు స్పీకర్‌గా ఫ్రభుత్వ చీప్ విప్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్‌ల స్థానాలు ఖరారయ్యాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

Show comments