ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర మంత్రులు

Webdunia
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గం సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎన్.డి.తివారీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

సోమవారం సాయంత్రం 6.40 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వర్ణమాల ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి తొలుత రాష్ట్రమంత్రిగా ప్రమాణం చేశారు.

ఆ తర్వాత వరుసగా శిల్పా మోహన్ రెడ్డి, డి. నాగేందర్, డి. శ్రీధర్ బాబు, డి.కె. అరుణ, మాణిక్య వరప్రసాద్, ధర్మాన ప్రసాదరావు, డి. రాజనర్సింహా, జీ. వెంకట రెడ్డి, జీ. అరుణకుమారి, గీతారెడ్డి, జే. కృష్ణారావు, కే. లక్షీనారాయణ, కే. పార్థసారథి, కే. రోశయ్య, కే. వెంకట రెడ్డి, కే. సురేఖ, ఎమ్, వెంకటరమణ, ఎమ్, అహ్మదుల్లా, ముఖేష గౌడ్, ఎన్. రఘు వీరారెడ్డి, పి. బాలరాజు, పి. లక్ష్మయ్య, పి. సుదర్శన్ రెడ్డి, పి. సుభాష్ చంద్రబోస్, పి. విశ్వరూప్, పి. రామచంద్రా రెడ్డి, పి. సత్యనారాయణ, పి. సబితా ఇంద్రా రెడ్డి, ఆర్. వెంకట రెడ్డి, ఎస్. విజయ రామరాజు, సునీతా లక్ష్మారెడ్డి, వి. వసంతకుమార్, బీ. సత్యనారాయణ, బీ. శ్రీనివాసరెడ్డిలు ఉన్నారు.

ఇదిలావుండగా వీరిలో దామోదర్ రాజనర్శింహా, గీతారెడ్డి, పార్థసారధి, పి. రామచంద్రా రెడ్డి, ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. కాగా మైనారిటీ నేత అయినప్పటికీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Show comments