Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసంద్రంలో తిరుపతి

Webdunia
మెగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా తిరుపతి జనసంద్రంలో మునిగిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జనం తిరుపతిని చేరుకున్నారు. సోమవారం సాయంత్రం నుంచి తిరుపతికి జన ప్రవాహం ఆరంభమైంది. దాదాపు 10 లక్షల మంది జనం తిరుపతిని చేరుకున్నారు. మంగళవారం సాయంత్రానికి తిరుపతి శివార్లు పూర్తిగా వాహానాలతో నిండి పోయాయి.

వేలాది వాహానాలు తిరుపతిని చేరుకున్నాయి. అవిలాల చెరువులో ఇసుక వేస్తే రాలనంత జనం సభాస్థలి వద్ద గుమికూడారు. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు జనంతో నిండిపోయాయి. రెగ్యులర్ సర్వీసులతో పాటు, అదనపు బస్సు సర్వీసులు, రైలు సర్వీసులు జనంతో కిటకిటలాడాయి.

తిరుపతిలోని వీధులన్నీ రాకపోకలతో రద్దీగా తయారయ్యాయి. ప్రముఖ సినీ నటుడు కావడంతో ఆయనపై అభిమానంతో చిరంజీవిని చూడడానికి పార్టీలకతీతంగా తిరుపతి చేరుకున్నారు. వీరిని నియంత్రించడానికి వీలుకాక నిర్వాహకులు నానా అగచాట్లు పడుతున్నారు. మొత్తంపై గతంలో ఎన్నడూ చూడని రీతిలో జనం తిరుపతిని చేరుకున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

Show comments