Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధానికి సిద్ధమైన 'బాబాయి - అబ్బాయి'లు

Webdunia
ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఒక కథానాయుకుడికి కన్నతండ్రి... మరో ముగ్గురు యువ హీరోలకు తాతా... ఆయన స్థాపించిన పార్టీకి ముప్పు వచ్చి పడింది. చిరంజీవి రూపంలో ఆ పార్టీకి పెద్ద ఆపదే వచ్చి పడింది. దీనికి తోడు ఆ పార్టీలోని నాయకులు వలసబాట పడుతున్నారు. బలం పుంజుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షుడికి 'నందమూరి' తారక మంత్రం మినహా మరోమార్గం కనిపించలేదు. సినిమా రంగంలోని బాబాయి- అబ్బాయిలను రంగంలోకి దింపారు.

ఆ పార్టీ ఏదో ఇప్పటికే అర్థం అయ్యిందనుకుంటాను. ఆ పార్టీ తెలుగుదేశం అని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినీ తెరపై తిరుగులేని కథానాయకుడుగా వెలుగొందుతున్న చిరంజీవి రాజకీయరంగంలో అడుగుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. అప్పటి నుంచే తెలుగుదేశం పార్టీకి విపత్కర పరిస్థితి ఎదురయ్యింది. ఈ పార్టీ నుంచే అధిక శాతం నాయకులు ప్రజారాజ్యంలోకి వలసబాట పట్టారు.

ఈ పరిస్థితులను తట్టుకోవడానికి తెలుగు తెరపై కథానాయకులుగా ఉన్న నందమూరి వంశీయులను రంగంలోకి దింపక తప్పలేదు. అందుకే బాబాయి - అబ్బాయిలు రాజకీయ తెరపై కనిపించనున్నారు. సినీ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలు ఇద్దరూ ఎప్పటి నుంచో తెలుగు సినీ తెరపై పోటీ పడుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆయనను రాజకీయరంగంపైకి తీసుకురావాలని చంద్రబాబు ఎత్తువేశారు.

పైగా దివంగత నేత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆపద వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత ఆయన వారసులుగా బాలకృష్ణపై ఉందనే అభిప్రాయం వెల్లడైంది. దీంతో బాలకృష్ణ, ఆయన సోదరుల కుమారులు యువ కథానాయకులు జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్, తారక రత్నలు రంగంలోకి దిగారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే పలుదఫాలుగా చర్చలు జరిపారు.

యువగర్జనతో నేరుగా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ముందుస్తు చర్యలుగా బాబాయి - అబ్బాయిలు హైదరాబాద్‌లో అభిమాన సంఘాలతో ఆదివారం సమావేశమయ్యారు. పరిస్థితిపై సమీక్ష జరిపారు. చిరంజీవితో రాజకీయ యుద్ధానికి సిద్ధమవుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీరట్‌లో నగ్న ముఠా హల్చల్ - మహిళలపై దాడులు

చనిపోయాడని అంత్యక్రియలు పూర్తి చేశారు.. మరుసటి రోజే తిరిగొచ్చిన ఆ వ్యక్తి!

యువకుడి ప్రాణం తీసిన మొబైల్ ఫోన్?

Bengaluru: టీటీడీ ఆరోగ్య పథకానికి బెంగళూరు భక్తుడు కోటి రూపాయల విరాళం

భారత్... అమెరికాకు సారీ చెప్పి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుంది : హోవార్డ్ లుట్కిన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

డాక్యుమెంటరీ నియమాల్ని బ్రేక్ చేసి అద్భుతంగా తీశారు : దర్శకుడు కరుణ కుమార్

Vishal: మగుడంకు దర్శకుడిగా మారిన విశాల్?

సినిమా, పర్యాటక రంగాలకు జీఎస్టీ స్లాబు ఊతం :కందుల దుర్గేష్

లిటిల్ హార్ట్స్ సక్సెస్ అవుతుందని ముందే చెప్పా : మౌళి తనుజ్

Show comments