Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ పోలీస్ కు విన‌తిప‌త్రం ఇస్తామంటేనే... ఇంత భ‌య‌మా?

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (15:12 IST)
ఎందుకు అర్ధ‌రాత్రి ఇళ్ళ‌కు వ‌చ్చి అరెస్టులు చేస్తున్నారు?  దిశ పోలీస్ స్టేష‌న్ కి వెళ్ళి ఒక విన‌తిప‌త్రం ఇస్తామంటేనే ఇంత భ‌య‌మా అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్ర‌శ్నించారు. విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేష‌న్లో అరెస్ట్ అయిన తెలుగుదేశం నాయ‌కులు స్టేష‌న్లోనే త‌మ నిర‌స‌న తెలిపారు. 
 
ఈ సంద‌ర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ, తెలుగు యువత, తెలుగు మహిళ, టి యన్ ఎస్ ఎఫ్ నేతలు దిశ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక్క రిప్రజెంటేషన్ ఇస్తానంటే ఎందుకు భయపడుతుంది ఈ ప్రభుత్వం? అని ప్ర‌శ్నించారు. మా కార్యకర్తలు నిరసనకు పిలుపు ఇస్తే, ఎందుకు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు? ఎందుకు అర్ధరాత్రి ఇండ్లకు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు? 
చాలా అత్యుత్సాహంగా అధికారులు వ్యవహరిస్తున్నార‌ని ఆరోపించారు.
 
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, టి యన్ ఎస్ ఎఫ్ నాయకులు ప్రణవ్ గోపాల్ పై   పోలీసులు చేయి చేసుకోవడం చూసామ‌ని, ఏ విధంగా రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందో అర్ధమవుతుంద‌ని, వాళ్ళను తీసుకెళ్లి ధర్డ్ డిగ్రీ ఉపయోగించి ఉంటార‌ని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని చెప్పారు. 
 
తిరుపతి పోలీసు కమిషనర్ వెంటనే తెలుగు యువత అధ్యక్షుడిని విడుదల చేయాల‌ని, ఆదే విధంగా వివిధ పోలీస్ స్టేషన్ల లో అరెస్ట్ చేసిన తెలుగు యువత నాయకులను కూడా విడిచిపెట్టాలని డిమాండు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments