Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందు తిని ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
మంగళవారం, 25 మే 2021 (11:13 IST)
కరోనా రోగుల కోసం కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు ఆరగించి ఎవరికైనా ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆనందయ్య మందు వాడొచ్చు అని నిర్ధారణ ఇవ్వాల్సింది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అని, ఏపీ ప్రభుత్వం కాదన్నారు. 
 
ఆయుష్ విభాగం నుంచి టీటీడీ కాలేజ్‌కు ఇన్ఫర్మేషన్ వచ్చిందని... అధ్యయనం చేసి రిపోర్ట్ పంపాలని ఆదేశాలు వచ్చాయన్నారు. 500 మంది డేటా తీసుకుని అధ్యయనం జరుగుతుందన్నారు. టీటీడీ ఆయుర్వేదిక్ కాలేజి ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ప్రొఫైసర్లు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. 
 
క్లినికల్ ట్రయల్స్ కూడా చేయాలని సూచన చేశారని... అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అధ్యయనం పూర్తి అయ్యాక మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్‌కు నివేదిక పంపుతామన్నారు. అధ్యయనంకు వారం సమయం పట్టే అవకాశం ఉందని, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుండి అనుమతులు వస్తే టీటీడీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో కూర్చుని ప్రతీ దాన్ని రాజకీయం చేస్తుంటారని మండిపడ్డారు. ‘‘అధ్యయనం చెయ్యకుండా పంపిణీ చేస్తే ఎవరికైనా ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు..? ఆయన తీసుకుంటారా..?’’ అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments