Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిని ఎందుకు వేధించారని ప్రశ్నించాడు.. వైకాపా యువనేతను కత్తితో పొడిచేశారు..

వైఎస్సార్ కాంగ్రెస్ యువనేత సత్తార్‌బేగ్ (35) దారుణహత్యకు గురయ్యారు. చిత్తూరు జిల్లా పెద్ద మండ్యంలో మంగళవారం రాత్రి సత్తార్ బేగ్ దారుణంగా హతుడైనాడు. పెద్దమండ్యం పాతవూరు జెండామాను వీధికి చెందిన కాలవగడ్డ

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (09:06 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ యువనేత సత్తార్‌బేగ్ (35) దారుణహత్యకు గురయ్యారు. చిత్తూరు జిల్లా పెద్ద మండ్యంలో మంగళవారం రాత్రి సత్తార్ బేగ్ దారుణంగా హతుడైనాడు. పెద్దమండ్యం పాతవూరు జెండామాను వీధికి చెందిన కాలవగడ్డ హుసేన్‌బేగ్ కుమారుడు సత్తార్‌బేగ్ (35) కార్పెంటర్‌గా పనిచేస్తూనే మండల వైసీపీ యూత్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. అతని బావమరిది ఇమ్రాన్ అదే ఊరిలో ఓ దుకాణం నడుపుతున్నాడు. 
 
ఇమ్రాన్ దగ్గరి బంధువు కుమార్తె కాలేజీకి వెళ్లే సమయంలో.. అదే గ్రామానికి చెందిన హర్షవర్ధన్, అతడి తమ్ముడి విష్ణు, మరో యువకుడు కోతిమణి కలిసి వేధించారు. వారిని ఇమ్రాన్ బెదిరించాడు. దీంతో కక్ష పెంచుకున్న యువకులు మంగళవారం మద్యం తాగి ఇమ్రాన్‌పై రాళ్లతో దాడిచేసి గాయపరిచారు. దీంతో ఇమ్రాన్ తన బావమరిది సత్తార్‌ను తీసుకుని యువకులను ప్రశ్నించేందుకు వెళ్లాడు. 
 
ఎందుకిలా చేశారంటూ సత్తార్ వారిని ప్రశ్నిస్తుండగానే అతని చాతిపై కత్తితో పొడిచేశారు. దీంతో అక్కడే కూలిపోయిన సత్తార్‌ను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే సత్తార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments