Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐకి లేఖ రాసిన RRR

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (17:48 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చీఫ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు శనివారం లేఖ రాశారు.
 
2019 అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందుగా మార్చిలో వైఎస్‌ వివేకానందరడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. 
 
వైఎస్ వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో వైఎస్ కుటుంబ సభ్యులపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్థిక లావాదేవీల్లో భాగంగా జరిగిన ఈ హత్యలో రూ.40 కోట్ల మేరకు సుపారీ చేతులు మారినట్లు, పథకం ప్రకారం అంతమొందించినట్లు నిందితులు చెప్పడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో సీబీఐ చీఫ్‌కు ఎంపీ రఘురామ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
 
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని ఎంపీ రఘురామ ఆ లేఖలో కోరారు. ఈ కేసులో ఆలస్యం జరిగితే నిందితులు ఎంతకైనా తెగించే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర హత్య కేసులో మాదిరిగానే నిందితులను హత్య చేసే కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments