Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ - షా ద్వయం అనుమతితోనే రివర్స్ టెండరింగ్ : విజయసాయి రెడ్డి

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (18:36 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టినట్టు వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. 
 
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)తో పాటు.. కేంద్ర జలవనరుల శాఖను బేఖాతరు చేస్తూ వైకాపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై పీపీఏతో పాటు.. కేంద్రం గుర్రుగా ఉంది. పైగా, పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్న నవయుగ కంపెనీ కూడా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో రివర్స్ టెండరింగ్ అంశంపై వాడివేడిగా చర్చసాగుతోంది. 
 
దీనిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ, అవినీతిని అడ్డుకునే విషయంలో తమ సంకల్పానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని, వాళ్లిద్దరినీ సంప్రదించాకే జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రివర్స్ టెండర్లు, గత ప్రభుత్వంలోని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) గురించి ప్రస్తావించారు. 
 
మోడీతో మాట్లాడాకే వీటిపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఏపీలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి రాష్ట్ర ఖజానాను దోచుకుందని, వారందరినీ చట్ట పరిధిలోకి తీసుకురావాలనేదే తమ దృఢసంకల్పమని విజయసాయి రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments