Webdunia - Bharat's app for daily news and videos

Install App

బురదపాము బయటకు వచ్చింది: రఘురామపై నందిగం సురేష్ ఫైర్

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (19:21 IST)
ఇదిగో పులి అంటే అదిగో తోక:
ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి మీద తాను సీబీఐ కోర్టులో కేసు వేశానని నిన్న రఘురామకృష్ణంరాజు ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పగానే తెలుగుదేశం తోక పార్టీలు, ఎల్లో మీడియా ఛానళ్లు ‘ఇదిగో పులి అన్న వెంటనే అదిగో తోక’ అంటూ తోక ఆడించడం మొదలెట్టాయి. రఘురామకృష్ణంరాజు వేసిన ఆ పిటిషన్‌ నిన్న సాయంత్రానికే సీబీఐ కోర్టు తిరస్కరించింది. కానీ ఈ వార్త మాత్రం ఎల్లో మీడియాకు బ్రేకింగ్‌ న్యూస్‌గా కానీ, న్యూస్‌గా కానీ కనిపించలేదు. కనీసం వాటిని వేయలేదు’.
 
బురదపాము బయటకు వచ్చింది:
ఇక రఘురామకృష్ణంరాజు విషయానికి వద్దాం. ఇంత కాలం మా పార్టీ తరపున లోక్‌సభలో డిస్‌క్వాలిఫికేషన్‌ పిటిషన్‌ ఇచ్చినప్పుడల్లా ఆయన ఏం చెప్పే వాడంటే నేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం లేదని, తప్పు చేయలేదంటూ తలదాచుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు ఈ పిటిషన్‌తో ఇన్నాళ్లూ లోపల దాక్కున్న బురదపాము బయటకు వచ్చింది’.
 
డిస్‌ క్వాలిఫై చేయాలి:
‘కాబట్టి ఇప్పుడు లోక్‌సభ స్పీకర్‌ను రఘురామరాజు లాంటి నయవంచకుణ్ని దిగజారుడు నాయకుడిని, పార్టీ ఫిరాయింపుదారుణ్ని క్షమిస్తే ఇక భారత రాజ్యాంగానికి అందులో ఉన్న పదో షెడ్యూల్‌కు విలువ లేకుండా పోతుంది. ఇప్పటికైనా రఘురామకృష్ణంరాజును డిస్‌క్వాలిఫై చేయాలి. ఆ మేరకు స్పీకర్‌ గారు నిర్ణయం తీసుకోవాలి. రాజ్యాంగంలో నిర్దేశించిన హక్కులు కాపాడాలి. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే, భవిష్యత్తులో రాజకీయంగా ప్రమాదకరంగా మారుతారు. రఘురామరాజు పక్క పార్టీ వారిని సపోర్టు చేస్తున్నారు. వారికి దాయాదుగా పని చేస్తున్నారు. ఆయన ఇంతగా ఎందుకు దిగజారాడు అంటే, ఆయనపై సీబీఐ, ఏసీబీ కేసులున్నాయి. వాటి నుంచి బయట పడడానికే చంద్రబాబుకు, ఇంకో పార్టీకి  అనుకూలంగా మాట్లాడుతున్నాడు. కానీ ఆయనను ఎవరూ కాపాడలేరు. ఆయన జైలుకు వెళ్లక తప్పదు’.
 
ముందు నీవు శుభ్రపర్చుకో:
‘రఘురామరాజు ముందు శుభ్రపర్చుకోవాలి. ఆ తర్వాత ఎదుటి వారిపై మాట్లాడాలి. తాను స్వయంగా సీబీఐ కేసులో ఉండి, సీఎం గారిపై సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశాడు. ఇంకా ఇవాళ ప్రెస్‌మీట్‌ పెట్టి, తనను చంపడానికి కడప నుంచి మనుషులను దింపారని ఆరోపించాడు. అసలు కుక్కను ఎవరైనా చంపుతారా? పిచ్చి కుక్కను పట్టాలంటే ఏం చేస్తారు? బోను వేసి పడతారు. అందుకే భయపడి ఢిల్లీలో దాక్కున్నావు. ఏపీకి రానని చెబుతున్నావు. సిగ్గు, శరం అన్నీ వదిలేసి ఢిల్లీలో దాక్కున్నావు’.
 
రోషం, ఆత్మ గౌరవం ఉంటే..:
నీకు నిజంగా రోషం ఉంటే, నైతిక విలువలు ఉంటే, నీకంటూ ఆత్మ గౌరవం ఉంటే, అసలు సిగ్గు లజ్జ ఉంటే ఏపీకి రా. ఇక్కడ తిరుగు. అంతే కానీ ఢిల్లీలో కూర్చుని ప్రెస్‌మీట్లు పెడుతున్నావు. మనం ఏం చెప్పినా ఎల్లో మీడియా ప్రసారం చేస్తుంది కదా అని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు లోపలికి వెళ్తే మందేస్తావు. బయటకు వస్తే మీడియాతో మాట్లాడతావు. ఆయనకు రెండే రెండు పనులు. తాగడం. వాగడం. ఇలాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు’.
 
విడిచి పెట్టబోము:
నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకులను మోసం చేశావు. అవి చిన్న నేరాలు కావు. వేల కోట్లు దోచుకుతిని నువ్వు నీతి గురించి మాట్లాడుతున్నావు. ఇలాంటి వారిని క్షమించి రాజకీయాల్లో కొనసాగనిస్తే, భవిష్యత్తులో భావి తరాలకు మనం ఎటువంటి సూచన ఇస్తామన్నది అర్ధం చేసుకోవాలి. కాబట్టి ఆయన మీద కచ్చితంగా చర్య తీసుకోవాలి. యాక్షన్‌ తీసుకోకపోతే మా స్థాయిలో మాత్రం అతణ్ని విడిచిపెట్టే ఉద్దేశం లేదు’.
 
దమ్ముంటే రాజీనామా చేయి:
ఇలాంటి చవట సన్నాసులంతా మాట్లాడి, ఇలాంటి చవట సన్సాసులంతా ఢిల్లీలో దాక్కుని, సాయంత్రానికల్లా ఏదో బార్‌లో కనిపించే ఈ వెధవలంతా కూడా ఈ మీడియా ముందు మాట్లాడుతుంటే, ఆ ఎల్లో మీడియా అదే పనిగా... వాడొకడు దొరికాడు. మా పార్టీ నుంచి గెలిచి, మా పార్టీ ఎంపీని అని చెప్పి మీడియాలో చెప్పుకుంటున్నాడు. నీకు సిగ్గు, లజ్జ ఉండాలి. కానీ అవి లేకుండా నేనింకా వైయస్సార్‌సీపీ ఎంపీని అని ఎలా చెప్పుకుంటావు. నీకు దమ్ముంటే, ధైర్యముంటే రాజీనామా చేయి. కానీ రాజీనామా చేసే దమ్ము లేక, అవకాశం వచ్చింది కాబట్టి ఈ మూడేళ్లు ఎంజాయ్‌ చేయాలని చెప్పి ఈ విధంగా నీవు దిగజారి రాజకీయ విలువలకు చరమగీతం పాడే విధంగా నీవు మాట్లాడుతున్నావు’. 
 
శునకానందం:
‘వీళ్లంతా కలిసి, ఆ ఎల్లో మీడియా కలిసి, ఆ బఫూన్‌ కలిసి శునకానందం. ప్రెస్‌మీట్లు, డిబేట్లు వారే పెట్టుకోవడం. వారికి వారే కామెంట్లు చేయడం. వాళ్లకు వాళ్లే నవ్వుకోవడం. ఈ ఎల్లో మీడియాకు సిగ్గు లేదు. వీడికి సిగ్గు లేదు. ఇదంతా విడిచేసిన బ్యాచ్‌. అన్నీ విడిచేసి తిరుగుతున్నారు. వీళ్లను ఎవరు పట్టించుకుంటారు. ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజలు ఇప్పటికే ఛీ కొట్టారు. రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అలాగే ఛీ కొడతారు’.
 
‘ఇక రాజకీయంగా ఆత్మహత్య చేసుకునే ఖర్మ తమకు పట్టింది అనుకునే విధంగా కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాము నిజంగా గెలుస్తాము. తమకు సత్తా ఉంది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని అనుకుంటే, ఎన్నికలను ఎదుర్కోవాలి. కానీ అలా ఎన్నికలను ఎదుర్కోకుండా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు. నిన్న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఎన్నికలపై స్టే ఇస్తే, కుప్పంలో టపాసులు కాల్చారు. అదేదో ఎన్నికల్లో గెల్చినట్లు’.
 
రాజకీయ వ్యభిచారం:
‘కాబట్టి రఘురామకృష్ణం రాజు అనే వ్యక్తి చాలా నీచంగా, గజ్జి కుక్క  కంటే, బురదతో పండుకున్న పంది కంటే, గాదె కింద పండుకున్న పందికొక్కు కంటే హీనంగా తయారయ్యాడు. నువ్వు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం. బ్యాంకులను కూడా మోసం చేశావు. నీవు ఏమేం చేస్తే నీకు రుణాలు వచ్చాయో అందరికీ తెలుసు’.
 
కుక్క తోక వంకర:
‘ఈ రాష్ట్ర ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్ధమైంది. అదేమిటంటే... కుక్క తోక వంకర. అది ఎన్నాళ్లు రాయి కట్టినా మళ్లీ వంకరే అవుతుంది. అలాంటి వాడే రఘురామకృష్ణంరాజు, ఎల్లో మీడియా. చంద్రబాబునాయుడు. అలాంటి వ్యక్తి నీతి, నియమాల గురించి మాట్లాడుతున్నాడు. ఎన్నికలకు పోయే సత్తా లేదు. అది లేకనే కదా ఇలాంటి దౌర్భాగ్యాలకు పాల్పడుతున్నాడు. ఇక్కడేమో ఎల్లోమీడియా, చంద్రబాబు ఉన్నాడు. అక్కడ ఢిల్లీలో అన్నీ విడిచేసిన వీడొకడు ఉన్నాడు. వాడితో ఎల్లో మీడియా మాట్లాడిస్తోంది. నీకు సిగ్గు, శరం ఏమీ లేవు. అన్నీ వదిలేసి ఢిల్లీలో కూర్చుని ఎల్లో మీడియాలో మాట్లాడుతున్నావు’.
 
చివరగా..
‘నీకు ధైర్యం ఉంటే, నీలో నిజాయితీ ఉంటే రాష్ట్రానికి రా. నిన్ను చంపడానికి కడప మనుషులు వచ్చారా? ఏం మాట్లాడుతున్నావు. నీవు ఎలా ఎన్ని ట్రిక్కులు చేసినా, నీవు చేసిన మోసాలకు, నేరాలకు శిక్ష తప్పదు. ఇది గుర్తుంచుకో’.. అని ఎంపీ నందిగం సురేష్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments