Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొల్ల‌పూడి మార్కెట్ యార్డులో ధాన్యం రైతులు ఇబ్బందిప‌డొద్దు!

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (16:55 IST)
ధాన్యం రైతులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని మైల‌వ‌రం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు, ఎమ్మెల్సీ తలశిల రఘరాం విజ‌య‌వాడ జెసి మాదవీలత గారికి విజ్ణప్తి చేశారు. విజ‌య‌వాడ శివారు గొల్లపూడి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ మాదవీలత  మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు, తలశిల రఘరాం సందర్శించారు. శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం వారు ధాన్యం రైతులతో మాట్లాడారు. మిల్లర్లు తరుగు పేరుతో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 
రైతుల నుంచి వివరాలను సేకరించిన జెసి మాదవీలత సంబందిత మిల్లర్లతో మాట్లాడి, సమస్య పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. రైతులను ఇబ్బందులను వెంట‌నే తీర్చాల‌ని, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు, ఎమ్మెల్సీ రఘరాం సంబందిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యార్డ్ చైర్మన్ కారంపూడి సురేష్, మండల పరిషత్ వైస్ చైర్మన్ వేమూరి సురేష్, సొసైటీ అధ్యక్షులు బోర్రా వెంకట్రావు, స్థానిక నాయకులు జాస్తి జగన్, గంగవరపు శివాజీ, గేరా సుమన్, యంపిటిసీ సభ్యులు, రైతులు, యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

విజయ్ కనిష్క హీరోగా చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ ప్రారంభించిన కలవరం సినిమా

వెంకటేష్ గారు పాడడం.. సినిమాకు పనిచేయడం నాకు కలగా వుంది : భీమ్స్ సిసిరోలియో

నా కోసం అందరూ ప్రార్థించారు : ఉన్ని ముకుందన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments