Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో ఎమ్మెల్యే రోజాకు 'పోకిరి' పూనాడు...

రాజకీయ నాయకులంటే పంచ్ డైలాగులు మామూలే. ఎన్నికల పర్యటనలకు బయలుదేరితో ప్రత్యర్థి పార్టీలోని నాయకులపై సెటైర్లు విసురుతూ రకరకాల డైలాగులతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. వైసీపీలో ఎమ్మెల్యే రోజాకు వచ్చిన గుర్తింపు అంతాఇంతా కాదు. తెలుగుదేశం పార్టీన

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (16:27 IST)
రాజకీయ నాయకులంటే పంచ్ డైలాగులు మామూలే. ఎన్నికల పర్యటనలకు బయలుదేరితో ప్రత్యర్థి పార్టీలోని నాయకులపై సెటైర్లు విసురుతూ రకరకాల డైలాగులతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. వైసీపీలో ఎమ్మెల్యే రోజాకు వచ్చిన గుర్తింపు అంతాఇంతా కాదు. తెలుగుదేశం పార్టీని జగన్ మోహన్ రెడ్డి తర్వాత తీవ్ర స్థాయిలో వైకాపా నుంచి ఇంకెవరైనా విమర్శిస్తున్నారా అంటే ఎమ్మెల్యే రోజా అని చెప్పక తప్పదు. ఆమె మాటలు అలా వుంటాయి మరి. 
 
ఇటీవలే నంద్యాల ఉప ఎన్నికలు ముగిశాయి. దాంతో ఇప్పుడు ఏపీలో రాజకీయ పార్టీలు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా నటి, ఎమ్మెల్యే రోజా కాకినాడలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రంలోని ఓ డైలాగును ఆవేశంతో చెప్పారు.
 
అదేమిటంటే... "ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో... (వాడే) వారే కాకినాడ ఓటర్లు(పండుగాడు)" అంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీని కాకినాడ ఓటర్లు చిత్తుచిత్తుగా ఓడించాలంటూ పిలుపునిచ్చారు. మొత్తమ్మీద ప్రచారంలో సినిమా డైలాగులతో రోజా బాగానే ఆకట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments