Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతింటికి దందా ప్రారంభించిన రోజా - బెదిరింపులకు దిగుతూ...

ఫైర్ బ్రాండ్ ఆర్కే.రోజా.. ఏది చేసినా సంచలనమే. ఏది మాట్లాడినా వివాదాస్పదమే. దూకుడుగా వ్యవహరిస్తూ అధికార పార్టీని దుయ్యబట్టడమే పనిగా పెట్టుకుంది. అయితే రాష్ట్రస్థాయిలో రోజా చేస్తున్న హడావిడే అంతలా ఉంటే

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (14:09 IST)
ఫైర్ బ్రాండ్ ఆర్కే.రోజా.. ఏది చేసినా సంచలనమే. ఏది మాట్లాడినా వివాదాస్పదమే. దూకుడుగా వ్యవహరిస్తూ అధికార పార్టీని దుయ్యబట్టడమే పనిగా పెట్టుకుంది. అయితే రాష్ట్రస్థాయిలో రోజా చేస్తున్న హడావిడే అంతలా ఉంటే నియోజకవర్గంలో మాత్రం ఆమెపైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. తన సొంత ఇంటి నిర్మాణం కోసం బెదిరింపులకు దిగుతోందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
నగరి వైకాపా ఎమ్మెల్యే రోజా. ఈమె ఎమ్మెల్యేగా కంటే సినిమా యాక్టర్‌గానే చాలా మందికి సుపరిచితమే. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా అదే దూకుడును కొనసాగిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. రోజా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి వైసిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది. అయితే అప్పట్లోనే ఆమెను స్థానికురాలు కాదంటూ కొంత మంది ఆరోపించారు. తనకు నియోజకవర్గంలో సొంత నివాసం కూడా లేదని హైదరాబాద్, చెన్నైలో తిరిగే ఆమె నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో రోజా లోకల్‌గానే ఉండాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె నగరిలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఆ ఇంటి నిర్మాణం వివాదాస్పందగా మారింది. ఇంటిని పూర్తిగా స్పాన్సర్ల డబ్బులతోనే నిర్మిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు టిడిపి నాయకులు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా ఉండి సొంత ఇంటిని నిర్మించుకుంటూ దాని నిర్మాణం కోసం దందాలకు పాల్పడుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. 
 
ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి అంతటినీ తనకు ఫ్రీగా అందించాలంటూ నియోజకవర్గంలో ఉండే కొంతమంది బిల్డర్లను బెదిరిస్తుందంటున్నారు టిడిపి నాయకులు. ఉదయం లేచింది మొదలు తాను మహిళనంటూ, మహిళా ఎమ్మెల్యేని అవమానించారంటూ హడావిడి చేసే రోజా ఇలా బెదిరింపులకు దిగడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు నియోజకవర్గానికి చెందిన తెదేపా నేతలు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments