వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ నేత - మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డికి వైకాపా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చార
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ నేత - మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డికి వైకాపా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు.
రాజకీయాల్లో సీనియర్ అని గొప్పలు చెప్పుకుంటున్న ఆనం.. నోటిని అదుపులో పెట్టుకోవాలని.. నోటికొచ్చిన భాషను ఉపయోగించడం సరికాదని హెచ్చరించారు. రాజకీయ నేతగా ఆనం మాటలు హద్దులు దాటుతున్నాయని.. ఆయన రాజకీయ నేతగా కాకుండా నటుడిగా మారిపోతే మంచిమార్కులు పడే అవకాశం ఉందని అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.
ఆనం తన వికృత చేష్టలను అదుపులో పెట్టుకోకపోతే... తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు తమతో పాటు ప్రజలు కూడా సిద్ధంగానే ఉన్నారని అనిల్ గట్టిగా హెచ్చరించారు. ఆనం బ్రదర్స్ పదవుల కోసం.. పాకులాడుతున్నారని తీవ్రస్థాయిలో అనిల్ ధ్వజమెత్తారు. ఇందుకు ప్రత్యేక కారణాలను ఎత్తిచూపాల్సిన అవసరం లేదని.. ఆనం బ్రదర్స్ పొలిటికల్ జర్నీ చూస్తేనే జనానికి అర్థమైపోతుందని అనిల్ గుర్తు చేశారు. పదవుల కోసం తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశపడే రకం కాదని అనిల్ అన్నారు.