Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీలో చేరనున్న చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే!

చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. గత పది రోజులుగా నియోజకవర్గంలో సన్నిహితులతో చర్చలు జరిపి వారి సమ్మతి తీసుకున్న అమర్.. తన మాతృ పార్టీ అయిన

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (09:37 IST)
చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. గత పది రోజులుగా నియోజకవర్గంలో సన్నిహితులతో చర్చలు జరిపి వారి సమ్మతి తీసుకున్న అమర్.. తన మాతృ పార్టీ అయిన టీడీపీలో పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో 16వ తేదీ సాయంత్రానికి విజయవాడలోని సీఎం నివాసంలో ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. 
 
వాస్తవానికి, పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కుటుంబం టీడీపీలోనే కొనసాగింది. అమరనాథరెడ్డి తండ్రి ఎన్.రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు చిత్తూరు ఎంపీగా హ్యాట్రిక్‌ సాధించి జిల్లా రాజకీయ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారు. ఆయన రాజకీయ వారసుడిగా అమరనాథరెడ్డి కూడా టీడీపీలో కీలక పదవులు నిర్వర్తించారు. 
 
సర్పంచ స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగిన అమరనాథరెడ్డి సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా తొలిసారి జిల్లా పదవిని  కైవసం చేసుకున్నారు. ఒకసారి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా, రెండుసార్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకున్న వైకాపా.. రెండేళ్లలోనే ఆ పట్టును పూర్తిగా కోల్పోయింది. ప్రస్తుతం వైకాపా 8 మంది, టీడీపీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments