Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభివృద్ధి కోసం రాజధాని మార్పును స్వాగతిస్తా : మంగళగిరి ఎమ్మెల్యే

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (13:16 IST)
వ్యక్తిగత పనులపై వేరే ఊరికి వెళితే తాను కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఇంత రాద్దాంతం చేస్తారా అంటూ వైకాపాకు చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అమరావతిపై రైతులు ఆందోళనలు కొనసాగిస్తుంటే వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఎక్కడ అంటూ విమర్శలు వచ్చాయి. ఇదే అంశంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆయన గురువారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తాను సొంత పనులపై నాలుగు రోజులు హైదరాబాదుకు వెళ్లానని... దీనిపై ఇంత రాద్దాంతం చేస్తారా? అని ఆయన మండిపడ్డారు. 40 ఏళ్లుగా చంద్రబాబు కనిపించడం లేదని కుప్పం ప్రజలు చెబుతున్నారని... దీనికి తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం చెప్పాలని ఆర్కే డిమాండ్ చేశారు. 
 
ఈనెల 17న శాసనసభలో రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారని... ఆ తర్వాత కొన్ని రోజులు తాను ఇక్కడే ఉన్నానని ఆర్కే చెప్పారు. చాలా కాలం తర్వాత తమ కుటుంబంలో ఒక వివాహం జరగబోతోందని... ఆ పనులపైనే తాను హైదరాబాదుకు వెళ్లానని తెలిపారు. రైతు సంక్షేమం కోసం పాటుపడే పార్టీ వైసీపీ అని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments