Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ముఖ్యమంత్రిని చూడాలనివుంది... ఆ మహిళా సీఎం ఆమేనా? పీవీపీ ట్వీట్

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (13:54 IST)
వైకాపా నేత, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ చేసిన ఓ ట్వీట్ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నవ్యాంధ్రకు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నానంటూ పీవీపీ చేసిన ట్వీట్ సారాంశం. ఈ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. ఈ ట్వీట్ గురించి ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నేతల కంటే వైకాపా నేతలే అధికంగా చర్చించుకుంటున్నారు. పైగా, ఈ ట్వీట్ సొంత పార్టీలోనే అమితమైన కాకను రేపింది. పీవీపీ చేసిన ట్వీట్‌లోని సారాంశాన్ని పరిశీలిస్తే, 
 
'బూజు పట్టిన సాంప్రదాయాలకు తెరదించుతూ... మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్టర్లను తీసుకోరు అనే ప్రభుత్వ వాదనను పక్కనపెట్టి... కొత్త శకానికి నాంది పలికిన సుప్రీంకోర్టు. ఆనాడు అన్న ఎన్టీఆర్‌ ఆడవారికి సమాన ఆస్తి హక్కులు కల్పించి, మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధులలో సగం, ప్రభుత్వంలో సగం' అంటూ ట్వీట్ చేశారు. 
 
పీవీపీ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే, కాసేపటి తర్వాత ట్వీట్‌ను ఆయన డిలీట్ చేశారు. కానీ, అప్పటికే ఈ ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసిన నెటిజన్లు దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పీవీపీ కోరుకుంటున్న మహిళా సీఎం ఎవరు? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. వైయస్ భారతి? వైయస్ షర్మిళ? వైయస్ విజయమ్మ? వీరిలో ఎవరనే చర్చ జరుగుతోంది.
 
ఇప్పటికే అక్రమాస్తుల కేసులో బెయిలుపై ఉన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఆయన తన భార్య వైఎస్. భారతికి ముఖ్యమంత్రి శిక్షణ ఇస్తున్నారనే ప్రచారం వైకాపా నేతలే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పీవీపీ తాజాగా చేసిన ఆ మహిళా ముఖ్యమంత్రి ట్వీట్ ఆమెనుద్దేశించి అయినదే అయివుంటుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments