Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం ఏరువాక బాబూ... వచ్చేవచ్చే వ‌ర్షాలు ఆగిపోయాయి... పార్థసారధి ఫైర్

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో రైతుల్ని కుంగదీసేలా ప్రభుత్వ వ్యవహరిస్తోంద‌ని వైసీపీ ముఖ్య‌నేత‌, మాజీ మంత్రి కొలుసు పార్ధ‌సార‌ధి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతులకు ఒక దిక్చూచి లేకుండా వ్యవసాయ విధానం ఉంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని కూడా ప్ర‌భ

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (18:04 IST)

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో రైతుల్ని కుంగదీసేలా ప్రభుత్వ వ్యవహరిస్తోంద‌ని వైసీపీ ముఖ్య‌నేత‌, మాజీ మంత్రి కొలుసు పార్ధ‌సార‌ధి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతులకు ఒక దిక్చూచి లేకుండా వ్యవసాయ విధానం ఉంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని కూడా ప్ర‌భుత్వం చేప‌ట్టలేద‌ని విమ‌ర్శించారు. చంద్రబాబు ఏరువాక చేస్తే వర్షాలు కూడా ఆగిపోయాయి. 

 
నీరు, విత్తనాలు, ఎరువులు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా ఏరువాక ఎందుక‌ని సార‌థి ప్ర‌శ్నించారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఏరువాకతో రైతులపై దొంగప్రేమ ప్రదర్శించకుండా, చంద్ర‌బాబు నిర్దిష్ట ప్రణాళిక ప్రకటించాల‌ని, రైతులకు అండగా ఉంటాం అనే నమ్మకాన్ని ప్రభుత్వం కలిగించాల‌ని డిమాండు చేశారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో రైతాంగం కుదేలైపోయింద‌ని, రైతులకు రావాల్సిన పంట నష్టాలు ఇంత వరకు ఇవ్వలేద‌ని విమర్శించారు.
 
ఏరువాక సాగాలోర‌న్నో... ట్రాక్టరుపై బాబు
సేద్యం రైతుల‌కు పండుగ కావాల‌ని ఏపీలో ఏరువాక కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం లాంఛ‌నంగా ప్రారంభించింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ల‌కు పాగా చుట్టుకుని, పంట పొలాల్లో ప‌నుల‌ను స్వ‌యంగా ప్రారంభించారు. రుతు ప‌వ‌నాలు ఏపీలోకి ప్ర‌వేశించిన త‌రుణంలో వ‌ర్షాలు బాగానే ప‌డుతున్నాయి. ఈ సంద‌ర్బంగా గ్రామాల్లో పొలం ప‌నుల‌ను ప్ర‌భుత్వం ఓ పండుగలా ప్రారంభిస్తోంది. దీనిని రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌లో మంత్రులు ప్రారంభించారు. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం రైతుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని విత్త‌నాలు, పురుగు మందుల‌ను స‌కాలంలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింద‌ని, న‌వ్యాంధ్ర‌లో స‌త్ఫ‌లితాలు సాధించాల‌ని సీఎం చంద్ర‌బాబు పిలుపు నిచ్చారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments