Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరాచకాలకు గొడుగు పట్టింది చంద్రబాబే : వైకాపా నేత సీఆర్

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (16:19 IST)
రాష్ట్రంలో అరాచకాలకు గొడుగు పట్టింది చంద్రబాబే అని వైకాపా నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే, కోడెల శివప్రసాద్ కుమార్తె, కుమారులపై బాధితులు ఎన్ని కేసులు పెట్టారు. చంద్రబాబు ప్రజాస్వామ్యానికి నీ భాషలో నిర్వచనం వేరా. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వై ఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లడం దారుణం.
 
చంద్రబాబు హయాంలో చట్టాన్ని తన పని తాను చేయ నిచ్చారా. తన పార్టీ క్యాడర్ కూడా చంద్రబాబును విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. ప్రజాస్వామ్యం, పోలీస్ వ్యవస్థ గురించి చంద్రబాబు మాట్లాడటం ఏంటి సిగ్గు పడాలి. చంద్రబాబు నీ పని అయిపోయింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంద రోజుల పాలనలో చంద్రబాబు వంద అబద్ధాలు మాట్లాడారు. 
 
8 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు అంటున్నారు. టీడీపీ నేతలు మీద దాడులు చేసారంటున్నారు. టీడీపీ నేతలు మీద దాడులు, హత్యలు చేస్తే ఎందుకు ఏ మీడియాలో కూడా ఎందుకు రాలేదు. పోలీస్ రికార్డుల్లో ఎందుకు ఎక్కలేదు. కొంత మందికి డబ్బులు ఇచ్చి చంద్రబాబు పునరావాస కేంద్రాలకు తీసుకొస్తున్నారు. 

గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరిగితే దాన్ని రాజకీయ ప్రయోజనాలు కోసం చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లిస్తున్నారు. చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు ఎవరు రాకపోవడంతో డబ్బులు ఇచ్చి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారు.
 
వనజాక్షి, ఐపీఎస్ అధికారి మీద మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు దాడి చేస్తే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతి వస్తే టీడీపీ నేతలు రాళ్ళ దాడి చేశారు. సీఎం వై యస్ జగన్మోహన్ రెడ్డి వంద రోజుల ప్రజా సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు.

తెలంగాణలో టీడీపీ మొత్తం ఖాళీ అయ్యింది. ఏపీలో కూడా టీడీపీ ఖాళీ కాబోతోంది. రాష్ట్రంలో మరో 30 ఏళ్ళు వైస్సార్సీపీ అధికారంలో ఉంటుంది భావించిన చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. అందుకే అయ్యన్న పాత్రుడుతో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పిస్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ  పొత్తుపై అయ్యన్నపాత్రుడు మాటలు చంద్రబాబు మాట్లాడించిన మాటలే. 
 
కోడెల అరాచకాలపై సిట్ ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే ఎందుకు చంద్రబాబు మాట్లాడలేక పోతున్నారు. టీడీపీ నేతలు అంబోతుల్లా తయారై రాష్ట్రాన్ని దోచుకున్నారు. రాష్ట్రంలో చంద్రబాబుకు నచ్చిన 10 గ్రామాలను ఎంచుకుని చర్చకు వెళ్దాం. జన్మభూమి కమిటీలు వలన ప్రజలకు అన్యాయం జరిగిందా లేదా జగన్ ప్రభుత్వం వలన ప్రజలకు మేలు జరిగిందా అనేదానిపై చర్చ పెడదాం.. చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగా లేని పోనీ అరాచకాలు సృష్టిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments