Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంతంగా ఉన్న గన్నవరంలో అలజడిరేపిన వల్లభనేని... వైకాపా సూసైడ్ అటెంప్ట్!

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (15:46 IST)
కృష్ణా జిల్లా గన్నవరంలో ఇపుడు అలజడి చెలరేగింది. ఈ అలజడి గన్నవరం పట్టణంలో మాత్రం కాదు. ఆ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ ఆ తర్వాత వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి వైకాపాలో ఏదో ఒక ప్రాంతంలో అలజడి చెలరేగుతూనేవుంది. 
 
వల్లభనేని వంశీ రాకను స్థానిక వైకాపా నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుకు, వంశీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది.
 
వైసీపీ నేత మొగిలిచర్ల జోజిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వంశీపై జోజిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ, ఆయన అనుచరుడు కోట్లు ఇద్దరూ కలిసి దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. దళితులకు రావాల్సిన టెండర్లను కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టుల కోసం వైసీపీని వల్లభనేని వంశీ నాశనం చేస్తున్నారని... వీరిపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

Anasuya: అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నాగబంధం మూవీ

శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్, బాబీ నిర్మాతలుగా రాజమండ్రీలో తాజా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments