Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డి వెనక వైసీపీ లేదండి.. ఏదైనా సూటిగా మాట్లాడుతాం: అంబటి రాంబాబు

టాలీవుడ్‌లో శ్రీరెడ్డి సంచలనాలు సృష్టిస్తోంది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ జరుగుతోందని.. ఇందుకు అమ్మాయిలు బలైపోతున్నారని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది. తాజాగా శ్రీరెడ్డికి సంబంధించిన 12 నిమిషాల ఆడియో టేప్ బయ

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (18:11 IST)
టాలీవుడ్‌లో శ్రీరెడ్డి సంచలనాలు సృష్టిస్తోంది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ జరుగుతోందని.. ఇందుకు అమ్మాయిలు బలైపోతున్నారని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది. తాజాగా శ్రీరెడ్డికి సంబంధించిన 12 నిమిషాల ఆడియో టేప్ బయటపడింది. వైసీపీ నేతలు పెద్ద ప్లాన్ వేసుకుని తన దగ్గరకు వచ్చారని ఆ ఆడియోలో వుంది. వైసీపీ తనను ఉపయోగించుకోవాలనుకుందని శ్రీరెడ్డి పేర్కొంది.
 
ఇంకా ఇరికిద్దామని చూశారని అయితే తన ఏడుపు చూసి కొద్దిగా తగ్గారని శ్రీరెడ్డి తెలిపింది. ఢిల్లీ స్థాయికి తన సమస్యను తీసుకువెళ్తానని శ్రీరెడ్డి చెప్పింది. శ్రీరెడ్డి వివాదం వెనుక ఎవరో ఉన్నారంటూ కొద్దిరోజులుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు కీలకంగా మారబోతున్నాయి. కానీ శ్రీరెడ్డి వెనుక వైసీపీ లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఖండించారు. 
 
శ్రీరెడ్డి ఆడియోలో వైసీపీ వాడుకునేందుకు ప్రయత్నించిందని చేసిన ఆరోపణల్లో నిజం లేదని అంబటి తెలిపారు. గురువారం అంబటి మీడియాతో మాట్లాడుతూ, శ్రీరెడ్డి వెనుకో.. మరో రెడ్డి వెనుకో ఉండాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. 
 
ఇటువంటి వ్యాఖ్యలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరు ఏం చేసినా దాని వెనుక వైసీపీ ఉందంటూ కొందరు కుట్ర చేస్తున్నారని అంబటి విమర్శించారు. ఏదైనా సూటిగా మాట్లాడుతామే తప్ప.. ఎవరు వెనుక నుంచో మాట్లాడాల్సిన అవసరం లేదని అంబటి స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments