Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jagan: షిప్‌ దగ్గరకు మాత్రం పవన్ ఎందుకు వెళ్లలేదు.. జగన్ ప్రశ్న

సెల్వి
గురువారం, 12 డిశెంబరు 2024 (10:32 IST)
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సెటైర్లు విసిరారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు, గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు.
 
ప్రతినెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రేషన్ బియ్యం వ్యవహారంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. కాకినాడ పోర్టులో కస్టమ్స్‌ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే అని అటు కేంద్రంలోనూ వాళ్లే ఉన్నారు, రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారన్నారు.
 
మరి ఎవరిమీద నిందలు వేస్తారు? ఎవరిమీద దుష్ప్రచారం చేస్తారు? అని జగన్ నిలదీశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతిచేస్తున్నారని కాని ఆ షిప్‌ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదన్ని మండిపడ్డారు. 
 
పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్‌ వన్ అని జగన్ మండిపడ్డారు. మరి వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారు అని నిలదీశారు. బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్ అన్ని దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతున్నాయన్నారు. 
 
అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదని… కాని దీన్ని ఇప్పుడు ట్విస్ట్‌ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments