Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో భారీ వైఎస్సార్ విగ్రహాన్ని లేపేశారు... వైకాపా నాయకులు చూస్తూ...

విజ‌య‌వాడ‌: న‌గ‌రంలోనే అత్యంత ఎత్త‌యిన‌... ఆక‌ర్ష‌ణీయ‌మైన వై.ఎస్. విగ్ర‌హాన్ని అధికారులు వ్యూహాత్మ‌కంగా తొల‌గించారు. అటు వైసీపీ నాయ‌కుల‌ను, ఇటు వైఎస్ అభిమానుల‌ను మ్యానేజ్ చేసి... వై.ఎస్. గుర్తును చెరిపేశారు. విజయవాడ పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద దివంగ‌త

Webdunia
శనివారం, 30 జులై 2016 (15:46 IST)
విజ‌య‌వాడ‌: న‌గ‌రంలోనే అత్యంత ఎత్త‌యిన‌... ఆక‌ర్ష‌ణీయ‌మైన వై.ఎస్. విగ్ర‌హాన్ని అధికారులు వ్యూహాత్మ‌కంగా తొల‌గించారు. అటు వైసీపీ నాయ‌కుల‌ను, ఇటు వైఎస్ అభిమానుల‌ను మ్యానేజ్ చేసి... వై.ఎస్. గుర్తును చెరిపేశారు. విజయవాడ పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌రుడి నిలువెత్తు కాంస్య విగ్ర‌హాన్ని అప్ప‌టి ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ల్యాంకో ఫౌండేష‌న్ ద్వారా నిర్మించారు. అప్ప‌ట్లో దీని ప్రార‌భోత్స‌వానికి అప్పటి రాష్ట్ర ముఖ్య‌మంత్రితో పాటు కాంగ్రెస్ నేత‌లు భారీగా హాజ‌ర‌య్యారు. 
 
విజ‌య‌వాడ న‌గ‌రానికే సెంటర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా ఉన్న ఈ వై.ఎస్. విగ్ర‌హాన్ని ఇపుడు ఫ్ల‌ైవోవర్ నిర్మాణానికి అడ్డంకిగా ఉంద‌నే సాకుతో అధికారులు ద‌గ్గ‌రుండి కూల‌గొట్టేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తల అందోళన.. మోహరించిన పొలీసు బలగాల మ‌ధ్య వైస్సార్ విగ్రహం తొలగించేశారు. వైసిపి నాయకులు మాజీ ఎమ్మెల్యేలు వంగ‌వీటి రాధా, జోగి రమేష్ ఉండ‌గానే, వైస్సార్ విగ్రహం తొలగింపు జ‌రిగిపోయింది. అర్ధరాత్రి సమయంలో భారీ యంత్రాలను అధికారులు విగ్రహం వద్దకు తరలించారు. 
 
సమాచారం తెలియడంతో పెద్ద ఎత్తున వైఎస్ ఆర్ సిపి కార్యకర్తలు విగ్రహం వద్దకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, జోగి రమేష్‌ల ఆధ్వర్యంలో విగ్రహం తొలగింపు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళ‌నకు దిగారు. ట్రాఫిక్‌కు ఎటువంటి ఆటంకం లేకపోయినా వైఎస్ ఆర్ విగ్రహాన్ని తొలగించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను విగ్రహం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా అభిమానులు వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వంగవీటి రాధాకృష్ణ వై.ఎస్. విగ్ర‌హానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విగ్రహం వద్ద బైటాయించి ఆందోళనకు దిగారు. 
 
మరోవైపు  ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులు వాహనాలతో తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా తరలి వచ్చిన పోలీసులు ఆందోళన నిర్వహిస్తున్న వంగవీటి రాధా, జోగి రమేష్‌లతో పాటు పలువురు కార్పోరేటర్‌లను కూడా అరెస్టు చేశారు. బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అరెస్టు చేసిన నాయకులను పోలీసులు పలు స్టేషనులకు తరలించారు. మొత్తం ఆరు ప్రొక్లైన్‌లు, భారీ క్రెయిన్లతో విగ్రహాన్ని తెల్ల‌వారుజాములోగా గ్యాస్ కట్టర్‌లతో తొల‌గించేశారు. 
 
తెల్ల‌వారేలోగా విగ్రహాన్ని తొలగించక పోతే వైఎస్ అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు కంగారుప‌డ్డారు. అయితే, దీనికి ముందురోజే జిల్లా క‌లెక్ట‌ర్ అహ్మ‌ద్ బాబు వంగ‌వీటి రాధాకృష్ణ‌తో ఈ విగ్ర‌హం తొల‌గింపుపై చ‌ర్చ‌లు జ‌రిపి, అంతా షో పుట‌ప్ ఆందోళన మ‌ధ్య విగ్ర‌హం తొలగించేశార‌నే వాదనలు వినిపిస్తున్నాయి. మ‌రోప‌క్క వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ సంద‌ర్భంగా ఇక్క‌డి రాక‌పోవ‌డంపై ఎన్నో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల కాలంలో ఎమ్మెల్యేల తీరు ఇలానే ఉంటుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments