Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ 16వ తేదీకి వాయిదా

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (15:24 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఈ నెల 16వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. బుధవారం ఈ కేసు విచారణకు రాగా, ఈ కేసులో ఓ నిందితుడిగా ఉన్న వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. అలాగే, ఇతర నిందితులు గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మనోహర్‌లను కూడా పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 
 
మరోవైపు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి, ఈ కేసులో ఓ నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా ఎస్కార్ట్ బెయిల్‌ను అక్టోబరు పదో తేదీకి పొడగించారు. భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్‍ మంగళవారంతో ముగిసింది. అయితే, ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మరికొంత సమయం కావాలని కోరడంతో న్యాయస్థానం ఎస్కార్ట్ బెయిల్‌‍ను మరోవారం రోజుల పాటు పొడగించింది. 
 
జనసేన - టీడీపీ పొత్తు : ఏపీలో బీజేపీ నేతల్లో వణుకు
 
2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన - టీడీపీ పొత్తు ఖరారైంది. ఆ తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర నేతల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశాన్ని అత్యవసరంగా భేటీ అయింది. ఇందులో పవన్ చేస్తున్న ప్రకటనలు గురించి ప్రధానంగా చర్చించారు. 
 
ఈ విషయంలో పార్టీ స్పష్టమైన నిర్ణయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి జాతీయ నేతలతో చర్చిస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా చర్చించారు. ఎన్డీఏలోనే ఉన్నట్లు పవన్ చెబుతున్నందున సంయమనం పాటించాలని సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది.
 
రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల పొత్తులపై పవన్ కల్యాణ్ ప్రకటనలు, ఆయన అభిప్రాయాలను జాతీయ నేతలతో చర్చిస్తామని వెల్లడించారు. త్వరలో జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇతర ముఖ్యనేతల సమక్షంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని తెలిపారు. పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్నట్లు కేంద్ర బృందం పరిశీలనలో తేలిందన్నారు. 
 
నాసిరకం మద్యం వల్ల అనేకమంది అనారోగ్యం బారినపడుతున్నారని తెలిపారు. ఎంపీ రఘరామకృష్ణరాజు మద్యం నమూనాలను ప్రయోగశాలల్లో విశ్లేషణ చేయించిన రిపోర్టులు ఉన్నాయని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకంతో ఆయుష్మాన్ భారత్‌ను అనుసంధానం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. అందుకు తగ్గట్లు చర్యలు ఉండడం లేదన్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments