Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేశ్‌కు వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుకలు... వైకాపాలో కలకలం!!

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2023 (08:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇపుడు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు క్రిస్మస్ కానుకలు పంపించారు. దీనికి ప్రతిగా ఆమెకు ధన్యవాదాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ ఊహించని పరిణామాతో వైకాపా ఒక్కసారిగా కలకలం చెలరేగింది. 
 
"వైఎస్ఆర్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతుంది... ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి. మీకు 2024లో అంతా శుభం కలగాలి" అంటూ లోకేశ్‌కు షర్మిల పంపిన సందేశంలో పేర్కొన్నారు. షర్మిల క్రిస్మస్ కానుకలు పంపిన విషయాన్ని నారా లోకేశ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంతేకాదు.. ఆమె పంపిన కానుకల పట్ల హర్షాన్ని వెలుబుచ్చారు.
 
ప్రియమైన షర్మిల గారూ... మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈ క్రిస్మస్‌తో పాటు, నూతన సంవత్సరాది కూడా సంతోషకరంగా సాగిపోవాలని నారా కుటుంబం శుభాకంక్షాలు తెలుపుతుంది" అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments