Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 మంది సభకు వచ్చింది.. 11 నిమిషాల కోసమా? షర్మిల ప్రశ్న

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (18:49 IST)
వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 10 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని సోమవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. సభా కార్యక్రమాల్లో భాగంగా, గవర్నర్ అబ్దుర్ నజీర్ ప్రసంగం ప్రారంభించగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. జగన్‌తో కలుపుకుని మొత్తం 11 మంది సభ్యులు సభలో కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉన్నారు. 
 
దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మీరు 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చింది 11 నిమిషాల కోసమా? అంటూ నిలదీశారు. సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో హాజరు కోసం సభకు వచ్చారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. 
 
అలాగే, గవర్నర్ ప్రసంగంపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. ఆయన ప్రసంగంలో ఎలాంటి పస లేదని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments