Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే తంతు.. కొనిపారేశారన్న జగన్.. సింహం సింగిల్‌గానే..?

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను కొనేసిందని జగన్ ఆరోపించారు. తద్వారా ప్రజ

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (16:48 IST)
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను కొనేసిందని జగన్ ఆరోపించారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేసిందని జగన్ ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్ఆర్ సిపి గట్టిపోటీ ఇచ్చిందన్నారు. అధికారికంగా టిడిపి గెలిచినా నైతిక విజయం తమదేనని ఆయన చెప్పారు.
 
డబ్బులు చల్లి గెలుచుకోవడం ఓ గెలుపేనా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా ప్రతినిధులను అద్భుతంగా కొనుగోలు చేశాడని ఆరోపించారు. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ టిడిపి ఎమ్మెల్యే పట్టుబడిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే తంతు జరిగిందని చెప్పారు.
 
మరోవైపు వైకాపా నేత రోజా కూడా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు. నిషేధానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఏడాది తరువాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అనంతరం ఆమె మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలిచిందని అన్నారు. సింహం సింగిల్ గానే వస్తుందని, ప్రజా క్షేత్రంలో గెలిచి తీరుతామన్నారు. 
 
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష పడకపోవడం వల్లే చంద్రబాబు మళ్లీ ఏపీలో కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకున్నారన్నారు. రూ.300 కోట్లు ఖర్చుపెట్టి ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించింది సీఎం చంద్రబాబే అని దుయ్యబట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments