పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఏలేరు ముంపు గ్రామాల్లో పర్యటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్.. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఏదో పనిచేసినట్లు నటిస్తున్నారన్నారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మాత్రం... చంద్రబాబులా నటించడం తెలియట్లేదని సెటైర్‌లు వేశారు.
ఏలేరును దివంగత మహానేత వైఎస్సార్.. 2008లో ప్రారంభిచారని గుర్తు చేశారు. కానీ 2014 సీఎంఅయ్యాక చంద్రబాబు ఏమాత్రం పట్టించుకొలేదన్నారు. మానవ తప్పిదాల వల్లే ఏలూరు రిజర్వాయర్‌లో వరదలు వచ్చాయన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించలేదని ఎద్దేవా చేశారు. ఒకవేళ .. ఇదే జగన్ ప్రభుత్వం ఉంటే వరదలకు నష్టపోయిన రైతులకు 45వేల రూపాయల వరకు అందేవని అన్నారు.