Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర్యాలీకి పిలిచి డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.. మండదా? అందుకే రాయితో కొట్టాను???

వరుణ్
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (15:21 IST)
సీఎం జగన్ బస్సు యాత్రా ర్యాలీలో పాల్గొనేందుకు పిలిచి డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, అందుకే తనకు మండి జగనన్నను రాయితో కొట్టాల్సివచ్చిదని జగన్‌పై గులక రాయితో దాడి చేసిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. "ర్యాలీకి పిలిచి 350 రూపాయలు, లిక్కర్ బాటిల్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదనీ, అందుకే జగనన్నను రాయితో కొట్టాల్సివచ్చింది అంటూ నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అయితే, ఈ నిందితుడుని అదుపులోకి తీసుకున్న అంశంపై విజయవాడ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేసు దర్యాప్తునకు సంబంధించిన వివరాలు బయటకు పొక్కకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్ డేటాతో పాటు క్లూస్ టీమ్ పరిశీనలో కీలక సమాచారం లభించినట్టు సమాచారం. 
 
కాగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తిని వడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఫుట్‌పాత్‌పై వేసే టైల్స్‌తో విరిగిన ముక్కను జేబులో పెట్టుకుని వచ్చిన సత్తి.. సడెన్‌గా సీఎంపైకి ఆ రాయిని విసిరినట్టు తెలుస్తుంది. ఈ దాడి కేసులో మంగళవారం ఉదయం సత్తిపాటు అతని పక్కనే ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్నా, సంతోష్‌లను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే, ఈ విషయాలపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments