Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాధృచ్చికంగా జగన్‌కు కలిసొచ్చిన గురువారం.. ఎలా?

Webdunia
గురువారం, 30 మే 2019 (08:29 IST)
సాధారణంగా కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలన్నా.. కొత్త ఉద్యోగంలో చేరాలన్నా మంచి రోజు, ముహూర్తాలను చూస్తుంటాం. అలాగే, వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి కూడా ఓ సెంటిమెంట్ అనుకోకుండా కలిసివచ్చింది. ఇటీవల వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైకాపా అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో నవ్యాంధ్ర సీఎంగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నార. మే 30వ తేదీ గురువారం మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ఆయనకు సీఎంగా ప్రమాణం చేస్తారు. 
 
అయితే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నిల పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఇలా అన్నీ కూడా యాధృచ్ఛికంగా గురువారమే వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీన గురువారం జరిగింది. మే 23న తేదీ గురువారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. మే 30వ తేదీ గురువారం జగన్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. దీంతో జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం కలిసొచ్చిందంటూ ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారం, వర్జ్యం గురించి తెలిసిన వారు గురువారం గురించి గొప్పగా చెబుతున్నారు. 
 
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైఎస్సార్‌సీపీ సాధించిన ఎమ్మెల్యేల స్థానాలు 151ని ఎటు నుంచి చూసినా (వెనుక నుంచి ముందుకు 151, ముందు నుంచి 151 అంకెలు వస్తాయి) ఒకేలా రావడం విశేషం. రాష్ట్ర చరిత్రలోనే ఒకే రాజకీయ పార్టీగా ఒంటరిగా పోటీచేసి ఏకంగా 86 శాతం (అత్యధిక) ఎమ్మెల్యేలను వైఎస్సార్‌సీపీ సాధించడం మరో రికార్డు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments