ఎన్ని వ్యవస్థలు మనపై కత్తిగట్టినా నన్నేమీ చేయలేరు : ప్లీనరీ వేదికగా సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (14:20 IST)
ప్రజల కోసం తాను సాగిస్తున్న ప్రయాణంలో ఎన్ని ముళ్లున్నా, ఎన్ని రాళ్లుపడినా ఎన్ని వ్యవస్థలు తనపై కత్తికట్టినా తనను ఏమీ చేయలేరని వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమైన ఆ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారమంటే అహంకారం కాదన్నారు. ప్రజలపై మమకారమని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ప్రజల కోసమే జీవించామన్నారు. గత 2009 నుంచి ఇప్పటివరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. ఈ ప్రయాణంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి కార్యకర్త, అభిమానికి సెల్యూట్ చేస్తున్నట్టు తెలిపారు. 
 
'ముఖ్యంగా, గత 2009 నుంచి అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాం. గత 2011లో పార్టీని ఏర్పాటు చేశాం. ఈ ప్రయాణంలో ఎన్ని ముళ్ళున్నా.. ఎన్ని రాళ్లుపడినా, ఎన్ని వ్యవస్థలు మనపై కత్తిగట్టినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు విలువలేదు. నా గుండె బెదరలేదు. నా సంకల్పం చెక్కుచెదరలేదు. 
 
నాన్న చనిపోయిన తర్వాత ఈ జగమంతా కుటుంబం ఏనాడూ నా చేయి వీడలేదు. తోడుగా నిలబడ్డాహరు. అడుగులు వేయడానికి బలాన్ని ఇచ్చారు. అందుకే గత 2019 ఎన్నికల్లో చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీని ప్రజలు ఇచ్చారని గుర్తుచేశారు. 
 
ఆ దేవుడి ఆశీస్సులతో 175 స్థానాలకుగాను ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారం అప్పగించారని చెప్పారు. అదేసమయంలో మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్నవారికి ఆ దేవుడు, ప్రజలు అదే సీట్లకు పరిమితం చేశారని, ఇదంతా దైవ నిర్ణయమన్నారు. 
 
అధికారంలోకి వచ్చాక పేదలు, సామాన్యులు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల కోసమే బతికాం. చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతిక్షణం తపించాం. మేనిఫెస్టోను ఎన్నికల సమయంలోనే ప్రచారం చేసి ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో పడేసిన సందర్భాలు ఈ రాష్ట్రంలో చాలాసార్లు చూశాం. మనం మాత్రం మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేసి గడపగడపకు వెళ్లి ప్రతి మనిషిని కలుస్తున్నాం అని సీఎం జగన్ ఏకరవు పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments