'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అంటూ పిలిచిన కోర్టు సిబ్బంది..

ఠాగూర్
గురువారం, 20 నవంబరు 2025 (14:03 IST)
ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ నగరం, నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన వెయిటింగ్ హాలులోకి వెళ్లారు. విచారణ ప్రారంభంకాగానే కోర్టు సిబ్బంది "ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి" అంటూ పిలిచారు. ఆ వెంటనే జగన్ కోర్టు హాల్లోకి ప్రవేశించి, న్యాయమూర్తికి నమస్కరించారు. 
 
ఆ తర్వాత న్యాయమూర్తి సూచన మేరకు హాజరుపట్టికలో సంతకం చేసారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్ కోర్టు నుంచి బయటకు వెళ్లేందుకు న్యాయమూర్తి రఘురాం అనుమతి ఇచ్చారు. విచారణ సందర్బంగా జగన్‌ను ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. కేవలం ఆయన హాజరును మాత్రమే జడ్జి పరిగణలోకి తీసుకుని సంతకం చేయించుకుని పంపించివేశారు. రాబోయే రోజుల్లో పిటిషన్లపై విచారణ జరుగనుంది. అలాగే, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎపుడు విచారణకు హాజరుకావాలనే అంశంపై కోర్టు త్వరలో నిర్ణయం తీసుకోనుంది. 
 
మరోవైపు, కోర్టు నుంచి బయటకు వచ్చిన జగన్ నేరుగా హైదరాబాద్ నగరంలోని లోటస్ పాండ్‌లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన బెంగుళూరుకు బయలుదేరి వెళతారు. కాగా, లోటస్ పాండ్ వద్ద వైకాపా శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అలాగే, అతికొద్ది మంది వైకాపా నేతలను లోటస్‌పాండ్‌లోకి అనుమతించారు. వీరితో జగన్ కొద్దిసేపు చర్చలు జరిపిన తర్వాత బెంగుళూరుకు బయలుదేరి వెళ్ళారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

Netflix నెట్ ఫ్లిక్స్ నిజంగానే స్కిప్ అడల్ట్ సీన్ బటన్‌ను జోడించిందా?

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments