Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా! భారీగా జీతభత్యాలు కూడా...

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (13:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడెమీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన నందమూరి లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాథ్యంలోని వైకాపా సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. 
 
దీంతో ఆమెకు రాష్ట్ర మంత్రికి కల్పించే సౌకర్యాలతో పాటు జీతభత్యాలు, ఆమెకు సంబంధించిన ఇతర అలవెన్సులను ఉన్నత విద్యాశాఖ చెల్లించబోతోంది. ఇక ఈ పదవిలో లక్ష్మీపార్వతి రెండేళ్లపాటు కొనసాగనున్నారు.
 
రాష్ట్రంలో వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల కాలంలో తమకు మద్దతుగా, అనుకూలంగా వ్యవహరించిన వారికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతున్న విషయం తెల్సిందే. ఈ కోవలో ఇప్పటికే సినీ నటి ఆర్కే. రోజా, వాసిరెడ్డి పద్మలకు నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఇపుడు లక్ష్మీపార్వతి పార్వతి వంతు చ్చింది.
 
ఇక తాజాగా ఆమెకు కేబినెట్ హోదా కూడా లభించింది. లక్ష్మీ పార్వతితో పాటు గల్ఫ్ దేశాల్లో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన జుల్ఫీకి కూడా కేబినెట్ హోదా లభించింది. అయితే జగన్ పార్టీ పెట్టిన కొన్ని రోజులకు వైసీపీలో చేరిన లక్ష్మీపార్వతి.. అప్పటి నుంచి ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments