శివరాత్రి వేడుకల్లో అపశృతి - గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతు!

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (11:09 IST)
మహాశివరాత్రి పర్వదినం రోజున తూర్పు గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శివరాత్రిని పురస్కరించుకుని గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని తాళ్లపూడి మండలంలో సంభవించింది. తాడిపూడిలో గోదావరి స్నానానికి దిగిన ఐదుగురు యవకులు గల్లంతయ్యారు. సమాచారం. అందడంతో పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని, గజ ఈతగాళ్ల సాయంతో యువకులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక యువకుడు మృతదేహం లభ్యమైంది. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు. 
 
సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. పది మంది మృత్యువాత 
 
దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మిలటరీ విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖార్జూమ్ సమీపంలోని వాది సీద్నా ఎయిర్ బేస్ నుంచి మంగళవారం రాత్రి ఆర్మీ ఫ్లైట్ బయలుదేరేందుకు సిద్ధమైంది. ఈ విమానం రన్‌వేపై పరుగులు పెట్టి టేకాఫ్ అవుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది మృతి చెందారు. వీరిలో ఆర్మీ అధికారులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు. అలాగే, పలువురికి గాయాల్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానానికి మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టింది. కాగా, టేకాఫ్‌లో సమస్యలు కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే, ఈ ప్రమాదంలో కనీసం 20 మంది వరకు చనిపోయినట్టు అనధికారిక వర్గాల సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం