Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించాడు... కాలయముడయ్యాడు.. హత్య చేసి.. ఇంట్లోనే పాతిపెట్టాడు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (09:53 IST)
ప్రేమించిన పాపానికీ ఓ యువతి పట్ల ప్రియుడే కాలయముడయ్యాడు. తనను నమ్మి వెంట వచ్చిన యువతిని నయవంచన చేసి ప్రాణాలు తీశాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా తన ఇంట్లోనే పాతిపెట్టాడు. ప్రేమ ముసుగులో ఓ కిరాతకుడు చేసిన హత్య చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ప్రేమికుల దినోత్సవానికి ముందురోజైన శనివారం వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే.. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం నక్కలవాండ్ల పల్లెకు చెందిన ఎన్. చిన్నప్పరెడ్డి కుమారుడు వేమనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఎంబీఏ పూర్తి చేసి స్థానికంగా ఉన్న ఓ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన జిలాన్ అనే వ్యక్తి కుమార్తె షిబియాపై మనస్సుపడ్డాడు. 
 
తండ్రి లేక పోవడంతో షబియా కూడా నారాయణ రెడ్డిని ఇష్టపడింది. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసిన షబియా.. నారాయణ రెడ్డిని గుడ్డిగా నమ్మి అతను చెప్పినట్టు నడుచుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో... షబియాను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు నారాయణ రెడ్డి చెప్పాడు. మతం వేరు కావడంతో వారు సమ్మతించలేదు. 
 
ఈ విషయాన్ని ప్రియురాలికి తెలిపిన నారాయణ రెడ్డి.. ఆమెకు తిరుపతిలో ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగంలో చేర్పించి... అక్కడే ఒక రూం అద్దెకు తీసిచ్చి.. తరచూ వెళ్లి వస్తుండేవాడు. ఈ విషయం నారాయణరెడ్డి తల్లిదండ్రులకు కూడా తెలిసింది. దీంతో వారంతా ఏకమై ఒక రోజున తిరుపతికి వెళ్లి షబియాను కొట్టివచ్చారు. ఈ క్రమంలో ఈనెల 28వ తేదీ నుంచి షబియా విధులకు రావడం మానేసింది. దీంతో కంపెనీ యజమాని షబియా తల్లిదండ్రులకు సమాచారం చేరవేశాడు. 
 
దీంతో ఆందోళన చెందిన షబియా తల్లి తిరుపతి వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. నారాయణరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. తిరుపతిలోనే షబియాను హతమార్చి.. తరిగొండకు తీసుకొచ్చి.. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి ఆవరణలోని చిక్కుడు చెట్టును తొలగించి.. ఆ స్థలంలో గొయ్యి తీసి పాతిపెట్టినట్టు అంగీకరించాడు. తన తల్లితండ్రులకు తెలియకుండానే ఈ పని చేసినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments