Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి వేరే దారిలేక ఆత్మహత్య చేసుకున్న యువకుడు... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (09:30 IST)
కరోనా లాక్డౌన్ దెబ్బకు ఆ యువకుడికి ఉద్యోగం పోయింది. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. కానీ, ఆ యువతి తల్లితండ్రులు మాత్రం ఉద్యోగం లేకపోవడంతో యువకుడికి తమ కుమార్తెను ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో తనకు ఇప్పట్లో ఉద్యోగం రాదనీ, అదేసమయంలో పెళ్ళికి మరో దారి కనిపించడం లేదని భావించి తీవ్ర మనస్తాపానికి లోనై ప్రాణాలు తీసుకున్నాడు. 
 
ఈ విషదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ మండలం మైలార్ దేవరంపల్లిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన వెంకటయ్య (22) అనే యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేవాడు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉద్యోగం పోవడంతో తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. 
 
ఈ క్రమంలో గ్రామానికే చెందిన యువతిని ప్రేమించాడు. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా అంగీకరించారు. మంచి రోజు చూసుకుని యువతి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి సంబంధం కోసం మాట్లాడారు. 
 
అయితే, యువకుడికి ఉద్యోగం లేకపోవడంతో అమ్మాయి తరపు తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అయినప్పటికీ ఆమెనే పెళ్లి చేసుకుంటానని యువకుడు తేల్చి చెప్పి, ఇతరుల ద్వారా యువతి తల్లిదండ్రులను ఒప్పించేందుకు యువకుడి కుటుంబ సభ్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వెంకటయ్య ఈ నెల 1న ఇంట్లోంచి వెళ్లిపోయి గ్రామంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి బలవన్మరణంతో గ్రామంలో విషాయచాయలు అలముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments