Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమోన్మాదం, నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ యువతి మెడపై కత్తితో దాడి చేసిన ఉన్మాది

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (18:00 IST)
గాజువాక యువతి హత్యోదంతం మరవకముందే విశాఖపట్నంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫెర్రీ జంక్షన్‌లో వద్ద ఓ యువతిపై శ్రీకాంత్‌ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. విశాఖ ఫెర్రీ వీధికి చెందిన ప్రియాంక అనే యువతిపై ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్‌ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. 
 
దాడి అనంతరం ఆమె తల్లిదండ్రులతో విషయం చెప్పాడు. వారితో మాట్లాడుతూనే అదే కత్తితో తనను తాను గాయపరచుకున్నాడు. వెంటనే స్థానికులు యువతీ యువకులిద్దరిని విశాఖ కింగ్‌జార్జ్‌ హాస్పిటల్‌కు తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఈఎన్‌టీ వైద్యుల పర్యవేక్షణలో ప్రియాంకకు చికిత్స అందుతోంది. ఆమె గొంతు దగ్గర గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆమెను శ్రీకాంత్ ప్రేమిస్తున్నట్టుగా సమాచారం. ప్రియాంక సచివాలయంలో వాలంటీర్‌గా పని చేస్తోంది.
 
మరో యువకుడితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో శ్రీకాంత్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments