పోలవరం ప్రాజెక్టు గురించి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం సమర్పించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును పట్టించుకోలేదనీ, దీనితో భారీగా నష్టం వాటిల్లిందని అన్నారు. ఆ సందర్భంగా గత ఐదేళ్లుగా అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటనలతో పాటు మాజీమంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలను ప్రదర్శించారు. ఆ వీడియోలను చూపిస్తూ సీఎం చంద్రబాబు పగలబడి నవ్వారు. పోలవరం ప్రాజెక్టు వీరికి హాస్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు.