Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రులకు యోగా తరగతులు.. ప్రారంభించిన చంద్రబాబు!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (11:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు యోగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ తరగతులను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభించారు. 
 
ఇప్పటికే చంద్రబాబు యోగా మంత్రాన్ని పఠిస్తున్న విషయం తెల్సిందే. తానే కాక తన ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు కూడా యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక పనితీరును కూడా మెరుగుపరచుకోవాల్సిందేనని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల జారీతో సరిపెట్టని చంద్రబాబు, ఏకంగా మంత్రులు, సీనియర్ అధికారులకు ప్రత్యేకంగా యోగా తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఈ తరగతుల నిర్వహణ బాధ్యతను ఈషా ఫౌండేషన్‌కు అప్పగించారు. 
 
దీంతో గురువారం నుంచి మూడు రోజుల పాటు హైదరాబాదులో నిర్విఘ్నంగా కొనసాగే తొలి విడత యోగా తరగతులకు మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు హాజరుకానున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలోని ఈషా ఫౌండేషన్‌కు చెందిన వంద మంది వాలంటీర్లు... మంత్రులు, అధికారులకు యోగాసనాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మలి విడతలో ఎమ్మెల్యేలకూ యోగాలో శిక్షణ ఇప్పించాలని చంద్రబాబు సర్కారు యోచిస్తోంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments